»   » రంగస్థలం స్పెషల్ షో: ఆ చిన్నారుల కళ్లలో ఆనందం నింపిన ఉపాసన!

రంగస్థలం స్పెషల్ షో: ఆ చిన్నారుల కళ్లలో ఆనందం నింపిన ఉపాసన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' సినిమాను వినికిడి సమస్య ఉన్న చిన్నారుల కోసం ప్రదర్శించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ స్పెషల్ షో వేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రామ్ చరణ్ భార్య ఉపాసన దగ్గరుండి చూసుకున్నారు.

'స్వీటెస్ట్, మోస్ట్ అడోరబుల్ పీపుల్ కోసం హైదరాబాద్‌లో 'రంగస్థలం' షో ఏర్పాటు చేసిన చిత్ర బృందానికి ధన్యవాదాలు. మీరు చాలా మంది సంతోషానికి కారణం అయ్యారు. మంచి చిత్రాలు ప్రతి ఒక్కరి హృదయానికి చేరువవుతాయి.' అని ఉపాసన అన్నారు.రంగస్థలం సినిమా విషయానికొస్తే... సుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత, ఆది, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు నమోదు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. యూఎస్ఏలో 2 మిలియన్ డాలర్లకుపైగా వసూలైంది.


'రంగస్థలం' చిత్రాన్ని దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. గ్లోబల్ థియేట్రికల్ రైట్స్ రూ. 80 కోట్లకు అమ్మినట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్లకు మూడు రోజుల్లోనే 70% మేర పెట్టుబడి రికవరీ అయింది. బాక్సాఫీసు వద్ద తొలివారం పూర్తయ్యేలోపు డిస్ట్రబ్యూటర్ల ఇన్వెస్ట్‌మెంట్ పూర్తిగా తిరిగి రావడంతో పాటు లాభాల్లోకి వెళతారని అంచనా.


ఈ మధ్య కాలంలో తెలుగులో రాని ఒక విభిన్నమైన సినిమా కావడం, చెవుటి వాడిగా హీరో క్యారెక్టరైజేషన్, కథలోని భావోద్వేగాలు,1980ల నాటి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఇలా అన్నీ కలగలపి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతికి గురి చేస్తోంది.


English summary
"Rangasthalam for the sweetest & most adorable people in hyderabad. thank you team #rangasthalam - u really made so many people happy. Good films touch everyone’s heart - even if they are differently abled." Upasana tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X