»   » బాలకృష్ణ కోసం ‘రంగస్థలం’ స్పెషల్ షో

బాలకృష్ణ కోసం ‘రంగస్థలం’ స్పెషల్ షో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కడ చూసినా 'రంగస్థలం' సినిమా గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. చాలా కాలం తర్వాత తెలుగులో ఒక విభిన్నమైన సినిమాను చూశాము అనే అనుభూతిని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. అటు సాధారణ ప్రజల నుండి ఇటు సినీ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫీ అద్భుతం అంటూ పొగడ్తలు గుప్పిస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'రంగస్థలం' సినిమాను ప్రముఖ నటుడు బాలకృష్ణ కోసం స్పెషల్ షో వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ రావడంతో బాలయ్య సినిమా చూసేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. బాలయ్యతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూడబోతున్నారట.

Rangasthalam Special Show for Balakrishna

ఇక బాక్సాఫీసు వద్ద 'రంగస్థలం' పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే తొలి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసి దూసుకెళుతోంది. యూఎస్ఏలో ఫస్ట్ వీకెండ్ లోనే 2 మిలియన్ మార్కును అందుకుంది.

రామ్ చరణ్ కెరీర్లో ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఫైనల్ రన్‌లో బాహుబలి తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాగా రంగస్థలం రికార్డులు క్రియేట్ చేయబోతోందని టాక్.

'రంగస్థలం' స్టోరీ మామూలు రివేంజ్ డ్రామానే అయినప్పటికీ కథలో భావోద్వేగాలు పలికించిన తీరు, కథలో వచ్చే ట్విస్టులు, ముఖ్యంగా ప్రేక్షకుల అంచనాలకు అందని క్లైమాక్స్‌, 1980 నాటి పల్లెటూరి బ్యాక్ డ్రాప్, రామ్ చరణ్, సమంత పెర్ఫార్మెన్స్ సినిమాను ఓ రేంజికి తీసుకెళ్లాయి.

English summary
Rangasthalam is one of the most talked about movies in recent times.We hear there will be a special screening of the movie for Balakrishna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X