»   » పవన్ కళ్యాణ్ రాకతో మార్మోగి పోయిన వేదిక- ‘రంగస్థలం’ విజయోత్సవం లైవ్!

పవన్ కళ్యాణ్ రాకతో మార్మోగి పోయిన వేదిక- ‘రంగస్థలం’ విజయోత్సవం లైవ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టి దాదాపు రూ. 165 కోట్లకుపైగా గ్రాస్, రూ. 104 కోట్లకుపైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి భారీ విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్' వారు నేడు(ఏప్రిల్ 13) హైదరాబాద్‌లో విజయోత్సవం ఏర్పాటు చేశారు. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ వేడుకకు పవర్ స్టార పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

Rangasthalam Success Meet : Pawan Kalyan Emotional Speech

ఫోటో గ్యాలరీ: రంగస్థలం విజయోత్సవ సంబరాలు

'రంగస్థలం' చిత్రంలో హీరో చిట్టిబాబు లుంగీలో డిఫరెంట్ గెటప్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విజయోత్సవ వేడుకకు నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్, మోహన్‌తో పాటు పలువురు అభిమానులు చిట్టిబాబు స్టైల్ ఫాలో అవుతూ లుంగీల్లో హాజరయ్యారు.


సుకుమార్ గారు అమేజింగ్ హ్యూమన్ బీయింగ్: దేవిశ్రీ

సుకుమార్ గారు అమేజింగ్ హ్యూమన్ బీయింగ్: దేవిశ్రీ

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ...రంగస్థలం సినిమా నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. అలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు ముందు సుక్కు భాయ్‌కి థాంక్స్. సుక్కు భాయ్‌కి ఎప్పుడు సక్సెస్ వచ్చినా అది మా సక్సెస్‌గా ఫీలవుతాం.


సుక్కుగారు ఒక ఎక్స్‌ట్రార్డినరీ డైరెక్టర్ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. చాలా మందికి తెలియని విషయం ఆయన అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. మనం ఏ పని చేసినా దాని సక్సెస్ మనకు మాత్రమే కాదు, మనతో పాటు పని చేసిన అందరికీ సొంతం అనే ఫీలింగులో ఆయనలో ఎప్పటికీ ఉంటుంది. సుక్కుగారు తన టీంను ఎంతో బాగా చూసుకుంటారు. ఇంపార్టెంట్ క్రెడిట్స్ కూడా ఆయన టీంకు ఇస్తారు. ఇది చాలా చాలా గొప్ప విషయం.


మైత్రి మూవీస్ వారికి ఎంత పెద్ద థాంక్స్ చెప్పినా సరిపోదు. మనం అందరం రామ్ చరణ్‌ను చిట్టిబాబు అని పిలుచుకుంటున్నాం. ఆయన కెరీర్లోనే ఇది ది బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఆయన పెర్ఫార్మెన్స్‌ను ఇంకా ఎలా రీడిఫైన్ చెయ్యాలో కూడా తెలియడం లేదు. అంత అద్భుతంగా చరణ్ చేశారు. రామలక్ష్మిగా సమంత నిజంగానే అందరికీ ఎంత సక్కగున్నదే అనిపించింది. జగపతి బాబుగారు ఇందాక అన్నారు దేవి నా వెనక ఉండి మంచి మ్యూజిక్ ఇస్తారని, కానీ అసలు విషయం అదికాదు.... ప్రెసిడెంట్ పాత్రలో ఆయన్ను స్క్రీన్ మీద చూస్తుంటే మాకే భయం వేస్తోంది. బాగా చేయకపోతే మమ్మల్ని ఎక్కడ లేపేస్తాడో అని భయంతో చేశాం కాబట్టే మ్యూజిక్ ఇంత బాగా వచ్చింది.


ఈ రోజు నా మనసు చాలా తృప్తిగా ఉంది: సమంత

ఈ రోజు నా మనసు చాలా తృప్తిగా ఉంది: సమంత

ఈ రోజు మా ‘రంగస్థలం' టీంలో ఉత్సాహాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ ఎలా కష్టపడ్డారో నాకు తెలుసు. ఈ రోజు మనసు చాలా తృప్తిగా ఉంది. మాకు ఇలాంటి సంతోషం ఇచ్చిన ప్రేక్షకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు. మేము అనుకున్న దానికంటే పెద్ద విజయాన్ని అందించారు. సుకుమార్ గారు మీరు నాకు ఇచ్చిన ఈ రామలక్ష్మి క్యారెక్టర్ నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. చిట్టి బాబు లేకపోతే రామ లక్ష్మి లేదు. ఇలాంటి సినిమాలో భాగం అయినందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఈ వేడుకకు వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇస్తున్న పవర్ స్టార్ గారికి థాంక్స్.... అని సమంత వ్యాఖ్యానించారు.


రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం' విజయోవ్సం వేడుక హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌తో గ్రాండ్ గా జరిగింది. రామ్ చరణ్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ అయ్యే సమయానికి సుకుమార్-రామ్ లక్ష్మణ్ వేదికపై డాన్స్ చేస్తున్నారు. వెంటనే సుకుమార్ మైక్ అందుకుని చిట్టిబాబు కూడా వేదికపైకి వచ్చి చిన్న డాన్స్ స్టెప్ వేయాలని కోరడంతో... మొదట కాస్త మొహమాట పడినా, వారి మాట కాదనలేక స్టేజీ మీదకు వెళ్లి డాన్స్ చేశారు చరణ్.


సుకుమార్ గారు ఆయుష్షు త్యాగం చేశారు: రామ్ లక్ష్మణ్

సుకుమార్ గారు ఆయుష్షు త్యాగం చేశారు: రామ్ లక్ష్మణ్

గోదావరి ఒడ్డున రాజీవ్ కనకాల గారి డెత్ సీన్ చేస్తున్నపుడు మధ్యాహ్నం ఒంటిగంటకు భయంకరమైన వస్తోంది. అక్కడికి కెమెరా, ఇంకా ఎక్విప్మెంట్ రావడానికి ఇంకా సమయం ఉండటంతో ఏంటి ఇంకా లేటవుతుందని డైరెక్టర్ గారు జుట్టు పీక్కుని టెన్షన్ పడ్డారు. ఆయన్ను టెన్షన్ నుండి బయట పడేయటానికి కెమెరాలు వచ్చేలోపు ఎంజాయ్ చేద్దాం అని చిన్న సాంగ్ పెట్టి ఆయనతో డాన్స్ చేయించడం జరిగింది అని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ తెలిపారు. ఈ సినిమా గొప్పగా రావడానికి సుకుమార్ గారు తన ఆయుష్షును త్యాగం చేశారు. ఆయన ఆయుష్షు వంద సంవత్సరాలనుకుంటే 10 సంవత్సరాలు వెనక్కి వచ్చాడు. అంత కష్టపడి, టెన్షన్ పడి చేశాడు. ఆయన పడుతున్న కష్టం చూసి చూస్తుంటే అప్పుడప్పుడు మాకు బాధగా అనిపించేది. ఆయన్ను చూడలేకే మేము... సార్ టెన్షన్ పడటం ఎందుకు, అలా అయితే షుగర్, బీపీలు వస్తాయని చెప్పి ఆయన్ను పక్కకు తీసుకెళ్లి డాన్స్ ఆడాము.... అని రామ్ లక్ష్మణ్ తెలిపారు.


అజయ్ ఘోష్

అజయ్ ఘోష్

రంగస్థలం చిత్రంలో నటుడు అజయ్ ఘోష్.... విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రెసిడెంట్ చేసే అన్యాయాలకు వంతపాడుతూ, రంగస్థలం గ్రామ ప్రజలను హింసించే పాత్రలో క్రూరమైన పాత్రలో అతడు నటించారు. సినిమాలో చిట్టిబాబు అతన్ని కొడుకుంటే థియేటర్లో చప్పట్లే చప్పట్లు. రంగస్థలం విజయోత్సవంలో ఆయన్ను వేదిక మీదకు పిలిచిన యాంకర్ సుమ ఈ విషయాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా అజయ్ ఘోష్ మాట్లాడుతూ.... నా మీద ఇంకో మూడు సీన్లు కూడా చిత్రీకరించారు. ఆ మూడు సీన్లు కూడా సినిమాలో ఉంటే బయట కనపడితే జనాలు నన్ను కొట్టేవారు. అంత అద్భుతంగా సుకుమార్ గారు ఆ సీన్లు తీశారు... అని తెలిపారు.English summary
Rangasthalam Vijayotsavam LIVE on Mythri Movie Makers with Pawan Kalyan as Chief Guest. #Rangasthalam 2018 Telugu Movie ft. Ram Charan, Samantha, Anasuya Bharadwaj, Aadhi Pinisetty, Prakash Raj and Jagapathi Babu. Rangasthalam is directed by Sukumar and music composed by DSP / Devi Sri Prasad. Produced by Naveen Yerneni, Y Ravi Shankar and Mohan Cherukuri under Mythri Movie Makers banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X