»   » త్వరలో తెలుగులో చేస్తున్నా: విద్యాబాలన్

త్వరలో తెలుగులో చేస్తున్నా: విద్యాబాలన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్వరలో తెలుగులో కూడా చేసే అవకాశం ఉంది అంటోంది విద్యాబాలన్. అయితే ఎవరా హీరో, దర్సకుడు,బ్యానర్ వంటి విషయాలు రివిల్ చేయలేదు. ఇంకా చర్చలు దశలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. బాలీవుడ్ హీరోయిన్స్ రాణి ముఖర్జీ, విద్యాబాలన్ హైదరాబాద్ వచ్చారు.వారి తాజా చిత్రం నో వన్ కిల్డ్ జస్సికా సినిమా ప్రమోషన్‌లో భాగంగా నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని సినీ మ్యాక్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విధ్యా బాలన్ మాట్లాడుతూ...సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా నిర్మించనున్న డర్టీ పిక్చర్స్ కోసం హోంవర్క్ చేస్తున్నా. సిల్క్ ఫేస్ వెరీ సెక్సీ. నేనంత సెక్సీ కాదు. ఈ క్యారెక్టర్‌కు ఎంత న్యాయం చేస్తాననేది భవిష్యత్ నిర్ణయిస్తుంది. ఇది కచ్చితంగా నా కెరీర్‌లో ఓ ప్రత్యేక సినిమా అవుతుంది.నేను నటిస్తున్న మలయాళీ సినిమా మా అమ్మానాన్నల కోసం. దర్శకుడు సంతోష్ శివంతో పనిచేయటం గొప్ప అనుభూతి అంది.

ఇక రాణి ముఖర్జీ మాట్లాడుతూ... జస్సికా నో వన్ కిల్డ్ జస్సికా రొమాంటిక్ థ్రిల్లర్. మీడియా పవర్ ఏంటో తెలిపే సినిమా. సినిమాలో నటించాక మీడియా, జర్నలిస్టులపై గౌరవం పెరిగింది. నా పెళ్లిపై వస్తున్న పుకార్లను నమ్మొద్దు. అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటా. జస్సికా.. సినిమాకి ఎ సర్టిఫికెట్ నిర్ణయంపై మాకు గౌరవముంది.యూ/ఏ ఇచ్చుంటే బాగుండేది. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా. ఈ మధ్య నాసినిమాలు సక్సెస్‌కు నోచుకోవడం లేదు. మీరా క్యారెక్టర్ డిఫరెంట్. క్రైం రిపోర్టర్ అయినంత మాత్రా న అసభ్య పదజాలం ఉపయోగించాలనేది మా ఉద్దేశం కాదు. ఒకవేళ మీరా డాక్టర్, లాయర్ అయినా అలాగే ప్రవర్తిస్తుంది అని చెప్పుకొచ్చింది. ఇక చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu