twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బూతు... రణవీర్, దీపిక, సోనాక్షి, యూట్యూబ్‌పై కేసు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, సోనాక్షి సిన్హా, అర్జున్ కపూర్, దర్శకుడు కరణ్ జోహార్‌లతో పాటు ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్‌లపై కేసు నమోదైంది. ఏఐబీ రోస్ట్ పేరుతో యూట్యూబ్ లో ప్రసారమైన ఓ కార్యక్రమం అభ్యంతర కరంగా, అసభ్యంగా ఉన్నాయని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. పై స్టార్స్ అంతా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడంతో వీరిపై కూడా కేసు నమోదైంది. అసభ్యకరమైన ఇలాంటి కార్యక్రమాలను వీడియోల రూపంలో నెటిజన్లకు అందించిన యూట్యూబ్ పైనా పుణే పోలీసులు కేసు నమోదు చేసారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
    అసలే ఏమైంది?

    ఇటీవల ముంబైలోని ఓ స్టేడియంలో దాదాపు 4 వేల మంది ప్రేక్షకుల మధ్య ఏఐబి రోస్ట్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను ఏఐబి యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసారు. ఈ వీడియోలకు ఇప్పటి వరకు దాదాపు 8 మిలియన్ల హిట్స్ వచ్చాయి.

     Ranveer, Deepika, YouTube, AIB All Named in New Complaint: Police

    అయితే ఈ కార్యక్రమం అసభ్య కరంగా ఉందనే విమర్శలు వచ్చాయి. ఏఐబీ రోస్ట్ కార్యక్రమంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో బాలీవుడ్ నటులు అభ్యంతరకర రీతిలో వ్యవహరించారని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏఐబి యూట్యూబ్ ఛానల్‌లో ఆ వీడియోను తొలగించారు. ఈ కేసుల్లో మోపిన అభియోగాలు వాస్తవమని తేలితే నిందితులు 5-10 ఏళ్ల దాకా జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల దాకా జరిమానాకు గురయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

    తీవ్రమైన ట్వీట్
    ప్రముఖ ఫిల్మ్ మేకర్, కొత్తగా ఏర్పాటయిన సెన్సార్ బోర్డులో మెంబర్ అయిన అశోక్ పండిత్ AIB షోను విమర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరణ్ జోహార్ పై చేసిన ట్వీట్ వివాదాస్పదం అయింది. అశోక్ పండిత్ తన ట్వీట్లో కరణ్ జోహార్‌తో పాటు కరణ్ తల్లి ప్రస్తావ తేవడం వివాదానికి కారణమైంది. Karan Johar could have easily shown his position while performing sex to his mom at home instead of making it public.#AIB Porn Show. అంటూ పండిత్ ట్వీట్ చేసారు.

    English summary
    Bollywood stars Deepika Padukone, Ranveer Singh, Sonakshi Sinha, Arjun Kapoor and director Karan Johar have been named in a new police case in Pune that accuses them and comedy collective AIB of obscene behaviour in a public place. YouTube is named for distributing the offensive content according to the First Information Report or FIR filed by a police inspector.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X