»   » లవర్ బాయ్‌ భయంకరమైన లుక్... (ఫోటోస్)

లవర్ బాయ్‌ భయంకరమైన లుక్... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం ఫాంలో ఉన్న బాలీవుడ్ యంగ్ లవర్ బాయ్స్ ఎవరు అంటే అందులో తప్పకుండా వినిపించే పేరు రణవీర్ సింగ్. త్వరలో రణబీర్ తన ఇమేజ్ కు భిన్నమైన లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పద్మావతి' చిత్రంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ పాత్రలో కనిపించబోతున్నాడు.

రాణి పద్మావతి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపిక పదుకోన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, షాహిద్ కపూర్.... పద్మావి భర్త రావల్ రతన్ సింగ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరి పాత్రలకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.... తాజాగా రణవీర్ సింగ్ పోషిస్తున్న అల్లాఉద్దీన్ ఖిల్జీ పాత్ర లుక్ రిలీజ్ చేశారు.

రణవీర్ సింగ్ భయంకరమైన లుక్

రణవీర్ సింగ్ భయంకరమైన లుక్

రణవీర్ సింగ్ లుక్ చూసిన అభిమానులు ఆయన్ను ఇంత భయంకరమైన లుక్ లో ఎప్పుడూ చూడలేదని, లవర్ బాయ్‌ని ఇంత క్రూరంగా ఊహించుకోలేక పోతున్నామని అంటున్నారు.

డిఫరెంట్ రోల్స్

డిఫరెంట్ రోల్స్

రణవీర్ సింగ్ నటుడిగా తనను తాను నిరూపించుకునేందుకు విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటున్నాడు. పద్మావతి చిత్రలో రణవీర్ సింగ్ పాత్ర కాస్త విలన్ లక్షణాలను పోలి ఉంటుందని సమాచారం.

పద్మావతి

పద్మావతి

రాజస్థాన్‌లోని చిత్తోడ్ కోటను ఏలిన రాణి పద్మావతి లైఫ్ హిస్టరీ బేస్ చేసుకుని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

షాహిద్

షాహిద్

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఈ చిత్రంలో రావత్ రతన్ సింగ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర పద్మావతి భర్త పాత్ర అని తెలుస్తోంది.

పీరియడ్ డ్రామా, లవ్ స్టోరీ

పీరియడ్ డ్రామా, లవ్ స్టోరీ

పీరియడ్ డ్రామాకు లవ్ స్టోరీ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మావతి-అల్లా ఉద్దీన్ ఖిల్జీ ప్రేమాయణం కోణంలో సినిమా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

రిలీజ్

రిలీజ్

‘పద్మవతి' సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండే పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. పద్మావతి, ఖిల్జీ మధ్య ప్రేమాయణం పచ్చి అబద్దం అని రాజ్ పుత్ వంశీయువల వాదన. వివాదాస్పద చిత్రంగా తెరకెక్కుతున్న ‘పద్మావతి' డిసెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది.

English summary
Padmavathi movie unit released the look of Ranveer Singh as Alauddin Khilji. The actor is playing a negative role for the first time in his career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu