»   »  పెద్దన్న భల్లాలదేవునికి కృతజ్ఞతలు

పెద్దన్న భల్లాలదేవునికి కృతజ్ఞతలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మరాఠా యోధుడు 'బాజీరావ్‌'కి భల్లాలదేవుడు వందనం చేశాడు. పీష్వా బాజీరావ్‌ జీవిత కథ ఆధారంగా సంజయ్‌లీలా భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బాజీరావ్‌ మస్తానీ'. ఈ చిత్రంలో బాజీరావ్‌గా నటిస్తున్న రణ్‌వీర్‌ సింగ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైంది.

తాజా పోస్టర్‌కి 'బాహుబలి' చిత్రంలో భల్లాలదేవుని పాత్ర పోషించిన దగ్గుబాటి రానా ట్విట్టర్ సాక్షిగా ప్రశంసల వర్షం కురిపించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దీనికి స్పందించిన రణ్‌వీర్‌సింగ్‌ 'పెద్దన్న భల్లాలదేవునికి కృతజ్ఞతలు, బాహుబలి-2 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం' అని అన్నారు.


దీనిపై రానా మాట్లాడుతూ.. మరాఠీ యోధుడు బాజీరావ్‌కి మహిష్మతి రాజు భల్లాలదేవుడు వందనం చేస్తున్నాడు. త్వరలోనే బాహుబలి-2, (బాహుబలి-3 కూడా) వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. 'బాజీరావ్‌ మస్తానీ' చిత్రం డిసెంబర్‌ 18న విడుదల అవుతున్న సందర్భంగా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Ranveer Singh thanks tweet to Rana

రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే, ప్రియాంక చోప్రాలు నటిస్తున్న చారిత్రక చిత్రం బాజీరావ్ మస్తానీ తొలి పోస్టర్ విడుదలైంది. సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర నటీనటుల పోస్టర్‌లను ట్విట్టర్‌లో ఉంచారు. పీష్వా బాజీరావు పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు. ఆయన భార్యలుగా దీపికా, ప్రియాంకలు కనబడనున్నారు.

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. భారీ యుద్ధ సన్నివేశాలతో ఉన్న చిత్ర ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.


మరాఠా యోధుడు బాజీరావ్ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘ఈరోస్' సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ'పై అపుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ‘'టీజర్ 'పై సర్వత్రా ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది.

English summary
Rana Daggubati ‏ tweeted:" The king of Mahishmathi salutes the brave #Bajirao (p.s. cming soon with Part -2 & 3 maybe ;) see u soon good luck ! "
Please Wait while comments are loading...