»   » సహజీవనానికి బై చెప్పిన స్టార్స్..సింపుల్ గా వివాహం

సహజీవనానికి బై చెప్పిన స్టార్స్..సింపుల్ గా వివాహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత రెండేళ్ళుగా లివింగ్ టు గెదర్ గా జీవితం గడుపుతున్న స్టార్స్ కొంకణాసేన్, రణబీర్ షోరే మొత్తానికి వివాహ బంధంలోకి వచ్చారు. శుక్రవారం సాయిత్రం ఆరు గంటలకు ముంబైలోని గార్గాన్ ఏరియోలో వీరి వివాహం మీడియోకు దూరంగా కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఒకటయ్యారు. ఇండస్ట్రీలోని వ్యక్తులనూ కూడా ఎవరినీ పిలవకుండా వీరి వివాహం జరగటం చాలా మందిని ఆశ్చర్యపరిచినా..చాలా కాలంగా కలిసి ఉంటున్న వారేగా అని సరిపెట్టుకుంటున్నారు. ఇక ఈ వివాహం పంజాబి, బెంగాళి సంప్రదాయాలతో కలగలపి జరిగింది. అలాగే ఈ వివాహంలో రణబీర్..శర్వాణి కట్టుకుని మెరిసిపోతే, కొంకణా సేన్ తన అమ్మమ్మ నగలు వేసుకుని మురిసిపోయింది. ఇక విషయమై బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ..వాళ్లిద్దరూ మొదటి నుంచి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న వ్యక్తులు. కాబట్టి పెళ్ళి కి పిలుస్తారని మేం ఎక్సపెక్ట్ చేయలేదు. అలాగే రిసెప్షన్ కూడా జరుగుతుందని అనుకోవటం లేదన్నారు.ఇక నేషనల్ అవార్డే కాక ఎన్నో అవార్డులు సంపాదించుకున్న కొంకణాసేన్...మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, పేజ్ త్రీ, ట్రాఫిక్ సిగ్నల్, వేక్ అప్ సిడ్ వంటి చిత్రాలు ద్వారా పాపులర్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu