twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ లో వారసత్వానికి అంత సీన్ లేదు..టాలెంట్ మీదే అవకాశం..!

    By Sindhu
    |

    సినిమా నేపథ్యం వున్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్లకి టాలీవుడ్ లో అవకాశాలు తన్నుకుంటూ వచ్చేస్తాయని చాలామంది అనుకుంటారు. అయితే, తమకంత సీన్ లేదంటున్నాడు రావు రమేష్. తన అసమాన నటనా ప్రతిభతో తెలుగు చిత్రసీమను కొన్నాళ్ల పాటు ఏలిన ప్రముఖ నటుడు రావు గోపాలరావు తనయుడైన రమేష్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు.

    నటవిరాట్ రావు గోపాలరావుగారి గురించి తెలియని తెలుగువారుండరు. ఆయన కుమారుడు రావు రమేష్ రావు కూడా తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని చలనచిత్ర సీమలో నటుడిగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చిత్రాలు “గమ్యం', 'కొత్త బంగారు లోకం'. ఆయన చేసిన బాగా గుర్తుండే, అందరినోటా వినిపించే క్యారెక్టర్ మగధీర లో 'అఘోరా'.

    అయితే, సినిమాల్లో అవకాశాలు రాకే ముందుగా టీవీ సీరియల్స్ లో తనను తాను ప్రూవ్ చేసుకుని ఇక్కడికొచ్చానని ఆయన మాట్లాడుతూ.. 'బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఇక్కడ చాన్సులు రావనడానికి నేనే చక్కని ఉదాహరణ. అందుకే, సీరియల్స్ లో సక్సెస్ అయ్యాక సినిమాల మీద దృష్టిపెట్టాను'అంటున్నాడు రమేష్.

    తండ్రి సంపాదించుకున్న కీర్తి వల్ల తనకు ఎక్కడికెళ్ళినా గౌరవం మాత్రం లభించిందని ఈ యువ నటుడు చెప్పాడు. తండ్రి రావు గోపాలరావుకి ప్రముఖ హాస్య నటుడు నగేష్ మంచి స్నేహితుడట. తన తండ్రిపోయినప్పుడు నగేష్ అంకుల్ చెప్పిన మాటలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయన్నాడు. 'ఇక్కడితో ఓ చరిత్ర ముగిసిపోయింది. రేపట్నుంచి మీ ఇంట్లో ఫోన్ మోగితే ఒట్టు. అలా జరిగితే నా పేరు మార్చుకుంటాను కూడా... అన్నారు నగేష్. ఆయన చెప్పింది అక్షర సత్యమైంది. ఒక్కరి నుంచీ ఫోన్ లేదు. ఏదైనా మనిషి ఉన్నంత వరకేలెండి" అంటున్నాడు రమేష్ నవ్వుతూ.

    English summary
    Rao Gopal Rao’s son Rao Ramesh didn’t try as hero taking his father’s name. He tried like a character artiste and shown his unique style. Even he has very good identity among masses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X