»   » త్రివిక్రమ్‌కు అడిక్టవుతున్నారు, కారణం ఏమిటి?

త్రివిక్రమ్‌కు అడిక్టవుతున్నారు, కారణం ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్‌ శ్రినివాస్. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయన సంపాదించిన పేరు మాత్రం చాలా ఎక్కవ. ప్రొఫెషనల్ గానే కాదు పర్సనల్ గా కూడా ఆయన ఎంతో మంచి వ్యక్తి అని ఆయనతో పని చేసిన వారు చెబుతుంటారు.

ఒక్కసారి త్రివిక్రమ్ గారికి కనెక్ట్ అయితే అడిక్ట్ అయినట్లే అయన్ను వదలబుద్ది కాదు అంటున్నారు ప్రముఖ నటుడు రావు రమేష్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, సమంత లాంటి స్టార్స్ ఆయనతో అంత క్లోజ్ గా ఉండటం చూస్తే అది నిజమే అనిపిస్తుంది.


Rao Ramesh about Trivikram Srinivas

త్రివిక్రమ్ గురించి రావు రమేష్ మాట్లాడుతూ....ఓ సినిమా అయి పోగానే చేయబోయే సినిమా గురించి ఆలోచిస్తాం... కానీ... త్రివిక్రమ్‌గారితో చేస్తే మాత్రం ఆయన్ని వదలబుద్ధి కాదు. షూటింగ్ పూర్తయినా ఆయనతో ఇంకా కాసేపు గడిపితే బాగుండు అన్న ఫీలింగు కలుగుతుంది అని తెలిపారు.


పని పూర్తయింది, అవసరం తీరిందా అని కాకుండా....త్రివిక్రమ్ తనతో పని చేసిన వారితో చాలా క్లోజ్ గా, సొంత మనిషిలా వ్యవహరించడమే అందుకు కారణం. వృత్తికి, జీవితానికి సంబంధించి ఎన్నో మంచి మాటలు చెబుతారట. ఆయన చెప్పే మాటలు అలా వింటూ ఉండిపోవాలనిపించేలా ఉంటాయట.


ఇప్పటి వరకూ చాలా మంది దర్శకులతో పనిచేశాను కానీ, ఎవరితోనూ ఇలాంటి ఫీలింగ్‌ కలగలేదు..నటీనటులకు ఆయన మంచి ఫ్రీడమ్‌ ఇవ్వడమే కాకుండా చాలా విషయాలు చెబుతుంటారు. నన్ను ఎప్పుడూ ''మీరు బాగా చేస్తే రావుగోపాలరావుగారి అబ్బాయి, చేయక ఏం చేస్తాడు? అంటారు. అదే బాగా చేయకపోతే వాళ్ళ నాన్న పరువు తీశాడురా అంటారు'' ఈ విషయాల్ని బాగా గుర్తు పెట్టుకోండి అంటూ చెప్పేవారు అని రావు రమేష్ గుర్తు చేసుకున్నారు.

English summary
Tollywood actor Rao Ramesh About his latest movie A..Aa directo Trivikram Srinivas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu