»   » బాలీవుడ్ టాప్ నిర్మాత పై రేప్ కేసు.... నగ్నంగా ఫొటోలు తీసి, గదిలో బంధించి

బాలీవుడ్ టాప్ నిర్మాత పై రేప్ కేసు.... నగ్నంగా ఫొటోలు తీసి, గదిలో బంధించి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ పై హయత్నగర్ పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదయ్యింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా నాలుగు సెక్షన్లకింద అతని పై కేసులు నమోదయ్యాయి. అత్యా చార బాదితురాలు డిల్లీకి చెందిన యువతి బీబీఏ విధ్యార్థిని. అయితే సినిమాలపై ఉన్న ఇష్టం తో ముంబై కి వచ్చి నటుడు అనుపం ఖేర్ కు సంబందించిన ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్న సమయం లో కొందరు మితృల ద్వారా కరీం మొరానీ తో పరిచయం జరిగిందనీ...

అవకాశం ఇస్తానని చెప్పి తన ఫ్లాట్కి పిఒలిచి వైన్ లో మత్తుమందు కలిపి ఇచ్చిన మొరానీ తనపై అత్యాచారం చేయటమే కాకుండా తన నగ్న ఫొటోలు తీసి వాటిని చూపించి బెదిరింపులకు దిగాడనీ. తానెక్కడుంటే అక్కడికి రప్పించుకుని మరీ తనమీద పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడనీ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దిల్ వాలే షూటింగ్ టైమ్ లో హైదరాబాద్ కి రప్పించుకుని మరీ శివార్ల లో ఉన్న హొటల్ గదిలో తనని బందించి పలుమార్లు తనమీద అత్యాచారానికి పాల్పడ్డాడని కూడా తెలిపిన యువతి... ఇన్నాళ్ళూ తన కుటుంబం పరువు పోతుందని ఈ విషయాన్ని బయటపెట్టలేదనీ,, కానీ తన సహనం నశించిపోయేంతగా అతని కృరత్వం భరించలేక ఇప్పుడు బయటపెడుతున్నాననీ తెలిపింది.

Rape allegations and case against Karim Morani

అంతే కాదు కరీం మొరానీ కి అండర్వరల్డ్ తోనూ మంచి సంబందాలున్నాయనీ, మాఫియాలో ఉన్న చాలామందితోనూ అతనికి పరిచయలున్నాయనీ ఆరోపించింది. ఈ నిర్మాత మొరానీ బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కి అత్యంత సన్నితుడు కావటం గమనార్హం. షారూఖ్ చేసిన రావన్, చెన్నై ఎక్స్ప్రెస్, దిల్ వాలే సినిమాలకు ఇతను సహనిర్మాతగా వ్యవహరించాడు . అంతే కాదు 2జీ స్పెక్ట్రం స్కాం లో ప్రధాన నిందితుల్లో ఇతనూ ఒకడు. ఆకేసులో అరెస్టయ్యాడు కూడా. డీఎంకే కరుణా నిధి కూతురు కళిమొని కి 20% వాటా ఉన్న కళైంగర్ టీవీ కి 200 కోట్లు అక్రమంగా డీబీ రియాలిటీ నుంచి తరలించటం లో సహకరించాడని కూడా ఇతని పై ఆరోపణలున్నాయి.

English summary
Rape allegations and case filed Against Bollywood Top Director Kareem Morani in Hayathnagar police station
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu