»   » వేషం ఇప్పిస్తానంటూ...నటిపై అత్యాచారయత్నం

వేషం ఇప్పిస్తానంటూ...నటిపై అత్యాచారయత్నం

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : ఈ రోజుల్లో కూడా సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటూ మోసం చేయటం, అత్యాచారానికి పాల్పడటం వంటి సంఘటనలు జరగటం విషాదకరం. తాజాగా అలాంటి సంఘటన ఒకటి బెంగుళూరులో చోటు చేసుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ సంఘటన ఇప్పుడు ఆ పరిశ్రమలో చాలా మందిలో ఆలోచనలో పడేసింది. వివరాల్లోకి వెళితే...

తాను చిత్ర నిర్మాతనని చెప్పుకుంటూ సంధ్య (అసలు పేరు కాదు) అనే సహనటిపై కుమార్‌ అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. నిందితుడు శివమొగ్గ జిల్లా కాంగ్రెసు నాయకుడు. బిసిలు కుదురె చిత్రం షూటింగ్ కు హీరోయిన్ కు స్నేహితురాలి పాత్ర వేసేందుకు రేష్మను మధ్యవర్తి ఉపేంద్ర సహాయంతో ఆహ్వానించిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Rape attempt on kannada co-artist

అతని చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు శివమొగ్గ మహిళా ఠాణాలో ఫిర్యాదు చేసింది. అనంతరం బెంగళూరులోని చలనచిత్ర వాణిజ్య మండలినీ ఆశ్రయించింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇకపై అనుమతి తప్పనిసరి

కర్ణాటకలో ఎక్కడ చిత్రీకరణ చేస్తున్నా చిత్ర యూనిట్‌ తప్పనిసరిగా చలనచిత్ర వాణిజ్య మండలి, సమాచార శాఖల అనుమతి పొందాలని మండలి అధ్యక్షుడు థామస్‌ డిసౌజా స్పష్టీకరించారు. నిర్మాతల విభాగం కార్యదర్శి భా.మా.హరీష్‌తో కలిసి ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.

చిత్రాల్లో నటించే యువతులు, సహ నటుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. చిత్రీకరణకు సంబంధించిన ప్రాంతాల వివరాలను ఒక వారం ముందుగానే తెలియజేసి అనుమతి పొందిన తరువాతే వెళ్లాలని చెప్పారు.

చిత్రీకరణలకు సంబంధించిన సమాచారం ఉన్నవారికే ఆయా ప్రాంతాల్లో అనుమతులు ఇవ్వాలంటూ డీజీపీకు, నగర పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు మండలి తరపున లేఖల్ని రాస్తున్నట్లు వివరించారు.

English summary
Bangalore police file FIR against congress leader kumar..who allegedly attempted in rape case on artist.
Please Wait while comments are loading...