»   » ఫోటోలు : కత్రినా కైఫ్ మోడలింగ్ చేసే రోజుల్లో..!

ఫోటోలు : కత్రినా కైఫ్ మోడలింగ్ చేసే రోజుల్లో..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : టాలీవుడ్‌లో "మల్లీశ్వరి"గా తళుక్కున మెరిసి.. ఆ తర్వాత బాలీవుడ్ సామ్రాజ్యానికి రారాణిగా నిలిచిన కత్రినా కైఫ్ అంద చందాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వరల్డ్ సెక్సియెస్ట్ భామగా కూడా ఆమె కీర్తి కెక్కింది. ఎప్పటికప్పుడు తన అందాలకు పదును పెడుతూ అభిమానులను మత్తెక్కించే కత్రినా...సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ రంగంలో రాణించింది.

బూమ్ చిత్రం ద్వారా ఇండియన్ ఫిల్మ్ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కత్రినా కైఫ్ ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్. ఈ స్థాయికి రావడానికి ఆమె ఎన్నో మెట్లు అధిగమించాల్సి వచ్చింది. కెరీర్ తొలి నాళ్లలో ఆమె నటనను చూసిన చాలా మంది సినిమా రంగానికి పనికి రాదని విమర్శించారు. తన అందంతో పాటు, నటన, డాన్సింగ్ స్కిల్స్ మరింత మెరుగు పరుచుకుని విమర్శించిన వారి నోటితోనే ప్రశంసలు అందుకుంది.

విదేశాల్లో పుట్టి పెరిగిన కత్రినా కైఫ్ మోడలింగ్ రంగంలో అడుగు పెట్టి కెరీర్ ప్రారంభించింది. అనేక ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్ చేసింది. అలా సినిమా వాళ్ల దృష్టిలో పడింది కత్రినా. మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

మోడలింగ్ రంగంలో ఆమె అందాలు చూసిన ఫిల్మ్ మేకర్ కైజద్ ఆమెకు తను తెరకెక్కించిన బూమ్(2003)లో చాన్స్ ఇచ్చాడు. అయితే ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా విజయం సాధించ లేదు. అయితే కత్రినా అందం పలువురు ఫిల్మ్ మేకర్స్ ను ఆకట్టుకుంది.

కత్రినా కైఫ్ తన రెండో సినిమా తెలుగులో వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి'లో చేసింది. ఈచిత్రంలో మల్లీశ్వరి అందానికి మంచి మార్కులే పడ్డాయి కానీ, నటన పరంగా మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఆ తర్వాత పలు బాలీవుడ్ అవకాశాలు దక్కించుకుంది.

కత్రినా కైఫ్ పూర్తిగా భారతీయురాలు కాదని, ఆమె సగం విదేశీయురాలని ఆ మధ్య దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి కాశ్మీరుకు చెందిన వాడు కావడం, తల్లి విదేశీయురాలు కాదవడే ఇందుకు కారణం. తల్లి విదేశీయురాలైనా కత్రినా రూపం ఇండియన్‌లా ఉండటం ఆమెకు కలిసొచ్చింది.

ఆమె అందం ముందు ఆ ఆరోపణలన్నీ దిగదుడుపే అయ్యాయి. కత్రినా అందానికి బాలీవుడ్ దాసోహం అయింది. ఆమె అందం ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. వరల్డ్ సెక్సియెస్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కత్రినా స్థాయి ఇంటర్నేషనల్ లెవల్ కు చేరింది.

ఇటీవల ఓ జ్యువెలరీ షాపు ఓపెనింగ్ కార్యక్రమంలో కత్రినా మాట్లాడుతూ... తాను చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగానని, 8 నుంచి 9 దేశాల్లో నా జీవితం గడించిందని, అలా పెరగడం కూడా నాకు చాలా ప్లస్సయింది' అని చెప్పుకొచ్చింది.

టాప్ పొజిషన్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించ లేదు, దాని గురించి నేనెప్పుడు ఒత్తిడికి గురి కాలేదని స్పష్టం చేసింది. ఆమె టాలెంటు, పరిస్థితుల ప్రభావం కత్రినాను ఆమె ప్రయత్నం లేకుండానే టాప్ పొజిషన్‌కు తీసుకెళ్లాయి అనడంలో సందేహం లేదు.

ఓ వైపు సినిమాలు, ఓ వైపు ఐటం సాంగులు, ఇవి కాకుండా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజిబిజీగా గడుపుతున్న కత్రినా.....సంపాదన విషయంలో అందరికంటే టాప్ రేంజికి చేరుకుంది.

వరల్డ్ సెక్సీయోస్ట్ ఉమన్ గా మారిన దగ్గర నుంచి అందరి చూపులు కత్రినాపైనే. దీంతో ఆమెకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా సంపాదన కూడా పెరిగింది.

గత సంవత్సరం ఆమె నటించిన రెండు చిత్రాలు ‘ఏక్ థా టైటర్' చిత్రంతో పాటు, ‘జబ్ తక్ హై జాన్' చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రాల జాబితాలో చేరాయి.

కత్రినా అనేక కార్పొరేట్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అత్యధికంగా సంపాదిస్తూ బాలీవుడ్ హీరోయిన్లలో టాప్ రేంజిక ఎదిగింది ఈ సెక్సీ లేడీ.

ప్రస్తుతం కత్రినా కైఫ్ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అందులో అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ధూమ్ 3 చిత్రం ఒకటి కాగా, మరొటి హృతిక్ హీరోగా రూపొందుతున్న బ్యాంగ్ బ్యాంగ్.

English summary
Actress Katrina Kaif has been a sensation in the tinselville, ever since she made her debut with the film Boom. Today, Katrina is one of the most beautiful and sought after actresses of the Bollywood industry. In fact, she is one of the highest paid stars of the industry as of today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu