»   » ఎన్టీఆర్ ఆఫర్ చేజారింది కానీ, రామ్ చరణ్ తో సెట్ అయ్యేటట్లు ఉంది

ఎన్టీఆర్ ఆఫర్ చేజారింది కానీ, రామ్ చరణ్ తో సెట్ అయ్యేటట్లు ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టైమ్ వస్తే...ఎవరూ ఎవరినీ ఆపలేరని మన పెద్దలు చెప్తూంటారు. ఈ మోడ్రన్ యుగంలో అలాంటి మాటలు నమ్మాలనిపించకపోయినా సినీ పరిశ్రమలో మాత్రం అలాంటి నమ్మకాలు నిజమే అనిపిస్తూంటుంది. ఎందుకంటే కలిసిరావటం మొదలెడితే ఆపే వాళ్లు ఉండరు అన్నట్లుగా ఓవర్ నైట్ లో లైఫ్ లు టర్న్ అవుతాయి. రాశి ఖన్నాకు కూడా టైమ్ వచ్చినట్లుంది. ఆమె ఇప్పుడు మెగా హీరో సరసన సినిమా దాదాపు ఓకే అయ్యింది. దీంతో ఆమె కెరీర్ పెద్ద టర్న్ తీసుకున్నట్లే.

కొద్దకాలం కాలం మైత్రీ మూవీస్‌ వారు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన 'జనతా గ్యారేజ్‌'లో ఐటెమ్‌ సాంక్ ..పక్కా లోకల్ కోసం రాశీఖన్నాని ఎంచుకొందామనుకొన్నారు. అయితే ఆ అవకాశం చివరికి కాజల్‌కి దక్కింది. దాంతో రాశీ చాలాబాధపడిందట.

 Rashi Khanna auditioned for Sukumar's film!

కానీ ఈసారి రాశీ పేరు ఖరారైపోయేట్టే కనిపిస్తోంది. అదీ మెగా హీరోసరసన, సుకుమార్ లాంటిస్టార్ డైరక్టర్ తో. ప్రస్తుతం 'ధృవ'తో బిజీగా ఉన్నాడు రామ్‌చరణ్‌. ఆ తరవాత సుకుమార్‌తో సినిమా పట్టాలెక్కనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కిస్తుంది. ప్రస్తుతం హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది.

ఇటీవల కొంతమంది ముంబయి మోడళ్లను స్క్రీన్‌ టెస్ట్‌ చేశారు. అయితే చివరికి రాశీఖన్నావైపు చిత్ర యూనిట్ మొగ్గు చూపిందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించే ఈ చిత్రం డిసెంబరులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

English summary
Ram Charan next movie with Sukumar’s leading woman is being scouted. Sources say that Rashi Khanna has been auditioned and confirmed for this role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu