For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మా ఇద్దరి అందమైన ప్రేమకథ ... ఆయన ఎనర్జీ చూసి ఆగలేకపోయా..రాశీఖన్నా

  By Rajababu
  |

  గ్లామర్ తో పాటు నటనకు ఆస్కారమున్న పాత్రల్ని బ్యాలెన్స్ చేస్తూ తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నట్లు టాలీవుడ్ ప్రముఖ నటి రాశీ ఖన్నా తెలిపారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం జైలవకుశ ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాశీ ఖన్నా తన మానసులో మాటను ఇలా చెప్పారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న ఈ చిత్రంలో తన పాత్ర ప్రత్యేకమైనదన్నారు.

  మా ఇద్దరి ప్రేమకథ నడుస్తుంది..

  మా ఇద్దరి ప్రేమకథ నడుస్తుంది..

  జైలవకుశ చిత్రంలో మ్యారేజ్ బ్యూరో నడిపించే ప్రియ పాత్రలో నేను ఒదిగిపోయానని పేర్కొన్నారు. నాకు జోడీగా లవ్ పాత్ర కనిపిస్తుందని... మా ఇద్దరి మధ్య అందమైన ప్రేమకథ నడుస్తుందని వెల్లడించారు. దర్శకుడు బాబీ కథ చెప్పిన వెంటనే.. ఈ చిత్రం గ్యారెంటీగా విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగిందన్నారు. ఎన్టీఆర్ ఎక్కడ తన పాత్రను డామినేట్ చేస్తారో అన్న చిన్న అనుమానం మాత్రం కలిగిందని... కానీ దర్శకుడు ప్రతి పాత్రను మలిచిన తీరు చూస్తే ఆ భయం పటాపంచలైందని రాశి పేర్కొన్నారు.

  ఆయన చాలా బ్రిలియంట్ ...

  ఆయన చాలా బ్రిలియంట్ ...

  ఎన్టీఆర్ ఎనర్జీ గురించి అందరు చెబుతుంటే విన్నాను. కానీ ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఆయన ఎనర్జీతోపాటు ఆయనలో ఎంత టాలెంట్ ఉందో చూశానన్నారు. ఆయన చాలా బ్రిలియంట్ యాక్టర్ అంటూ ఎన్టీఆర్ కి కితాబిచ్చారు. ఆయన ఎనర్జీలో కొంత అయినా నాలో ఉంటే బాగుండేది కదా అంటూ నవ్వూతూ అన్నారు.

  ఎన్టీఆర్ ఎనర్జీ చూసి ఆగలేకపోయా...

  ఎన్టీఆర్ ఎనర్జీ చూసి ఆగలేకపోయా...

  ఎన్టీఆర్ ఎనర్జీ, నటనను చూసి ఆగలేకపోయాను. ఇంత ఎనర్జీ ఎలా అని ఓ రోజు ఉండబట్టలేక ఎన్టీఆర్ ను అడిగేశాను. జీవితంలో ఏదైనా అనుకుంటే సాధించాలని... అదే శ్వాసగా సాగాలని.. అదే చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నా శ్వాస, ధ్యాస సినిమానే అని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. అందుకే ఆయన అంత ఎనర్జీటిక్ గా ఉన్నారమో అనిపించిందన్నారు.

  ఆ పాత్రలు కష్టం కదా...

  ఆ పాత్రలు కష్టం కదా...

  ప్రతి నటికి నటనకు ఆస్కారం ఉండే పాత్రల్లో కనిపించాలని ఉంటుందని... నాకు అలానే ఉందని చెప్పారు. టాలీవుడ్ సినిమాల్లో ఆ తరహ పాత్రలు ఉండటం కష్టం కదా అని ఆమె పేర్కొన్నారు. గ్గామర్ పాత్రలోపాటు బెల్లం శ్రీదేవి లాంటి పాత్రలు రావడం సంతోషంగా ఉందన్నారు.

  దర్శకుడి కోసమే ఫ్రీగా నటించా...

  దర్శకుడి కోసమే ఫ్రీగా నటించా...

  రాజా ది గ్రేట్ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన కోసం ఈ చిత్రంలో ఓ చిన్న అతిథి పాత్ర చేశానని తెలిపారు. అది కూడా ఓ పాటలో ఇలా వచ్చి అలా వెళ్లి పోతానన్నారు. అయితే భారీ పారితోషకం కోసమే నేను ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ అదంతా అవాస్తవమని ఖండించారు. కేవలం దర్శకుడి కోసమే ఎలాంటి పారితోషకం తీసుకోకుండా ఆ పాటలో నటించానని స్పష్టం చేశారు.

  తొలిప్రేమలో నటిస్తున్నా..

  తొలిప్రేమలో నటిస్తున్నా..

  వరుణ్ తేజాతో వెంకీ అట్లూరి నిర్మిస్తున్న తొలిప్రేమలో నటిస్తున్నట్లు చెప్పారు. గతంలో నేను హీరోయిన్ గా నటించిన ఊహలు గుసగుసలాడే చిత్రం లాగానే ఇది పూర్తి ప్రేమకథ చిత్రమన్నారు. అలాగే రవితేజతో కలసి టచ్ చేసి చూడు చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. మరో రెండు తమిళ చిత్రాలు కూడా నటిస్తున్నట్లు రాశీ కన్నా పేర్కొన్నారు. అదికాక ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ నటిస్తున్న చిత్రంలో పోలీస్ అధికారిగా నేను కనిపిస్తానన్నారు. ఈ చిత్రంలో హీరో విశాల్ పాటు హన్సిక ఇతర ప్రముఖ నటులు ఉన్నారని చెప్పారు.

  English summary
  Tollywood's heroine Rashi Khanna's latest movie is Jai Lava Kusa. This movie is releasing on September 21st. In this occassion, Rashi Khanna speakes to media regarding her latest movie. She said I acted for free because Director Anil Ravipudi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X