»   » ఇలాగే ఉంటది... పేరేమో ఇక్కడ చూపేమో అక్కడికి, తమిళ్ కి ఎగిరిపోతోంది

ఇలాగే ఉంటది... పేరేమో ఇక్కడ చూపేమో అక్కడికి, తమిళ్ కి ఎగిరిపోతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో ఎటూ అగ్ర హీరోయిన్ స్థానానికి దగ్గరగా వచ్చిన రాశీ ఖన్నా త‌మిళంలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇద్దామా అన్న‌ట్టుగా కొంత‌కాలంగా అటువైపు చూస్తోంది . అద‌ను చూసి అక్క‌డ ఓ మంచి సినిమా చేయాల‌నుకొంటూ వ‌చ్చింది. కాస్త ఆల‌స్య‌మైనా ఎట్ట‌కేల‌కి ఆ అవ‌కాశం రానే వ‌చ్చింది. సిద్ధార్థ్ క‌థానాయ‌కుడిగా తెరకెక్క‌నున్న త‌మిళ చిత్రం సైతాన్ కా బ‌చ్చా సినిమాలో హీరోయిన్‌గా రాశిఖ‌న్నా ఎంపికైంది.

కార్తీక్ అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్న ఈ చిత్రం త‌మిళంతో పాటు, హిందీ, తెలుగు భాష‌ల్లోకి వెళ్ల‌నుంది. ఆ మూడు భాష‌ల్లోనూ తెలిసిన క‌థానాయిక కాబ‌ట్టి రాశిఖ‌న్నానే క‌రెక్ట్ అనుకొంద‌ట చిత్ర‌బృందం. సిద్ధార్థ్‌లాంటి క‌థానాయ‌కుడి సినిమా కాబ‌ట్టి రాశిఖ‌న్నా కూడా ఇంత‌కంటే మంచి అవ‌కాశం మ‌రొక‌టి రాద‌ని ఫిక్సైపోయింది. వెంట‌నే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది. తెలుగులోలాగా త‌మిళంలోనూ దున్నేయాల‌ని ప్లాన్ చేసుకొంటోంది రాశి.

Rashi Khanna

మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే తో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన్న ఈ భామ .ఆమె తెలుగు,హిందీ చిత్రాల్లోనటిస్తోంది. ఇప్పుడు ఆమె తాజాగా తమిళ పరిశ్రమకు కూడా పరిచయమైంది.ప్రస్తుతం తమిళంలో కార్తీక్‌ జి. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న 'సైతాన్‌ కా బచ్చా'అనే చిత్రం లో సిద్ధార్థ్ సరసన రాశిఖన్నా కథానాయికగా నటిస్తున్నారట.

ఈ చిత్రం లో స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ సుబ్బరాయన్ విలన్‌ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సీద్దార్థ్ కూడా చాలా కాలంగా సరైన హిట్ లేక చతికిల బడే ఉన్నాడు. మూడేళ్లుగా 'ఉదయం..', 'తీయా వేలై సెయ్యనుం కుమారు', 'జిగర్‌దండా', 'కావియ తలైవన్‌'.. వంటి సినిమాలు చేసినా పెద్ద లాభం లేకపోయింది. వీటిలో చాలా వరకు సినిమాలు సిద్దూకి నిరాశనే మిగిల్చాయి. అక్కన్నుంచీ కాస్త వెనకా ముందు చూసిన తర్వాతే పాత్రలను ఎంచుకుంటున్నాడు.దాంతో గత ఏడాది 'ఎనక్కుల్‌ ఒరువన్‌'లో మాత్రమే చేసాడు. చూద్దాం రాశి తో జతకడితే అయినా మనొడి ఫేట్ మారుద్దేమో...

English summary
Rashi Khanna is surely going places. She will now foray into Kollywood with the film 'Shaitaan Ka Bachcha'. Siddharth will be the leading man in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu