»   » రాశీఖన్నా...! మరీ అన్ని అంటే నమ్మొచ్చా??

రాశీఖన్నా...! మరీ అన్ని అంటే నమ్మొచ్చా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పటివరకు హీరోయిన్ గా మెప్పించిన రాశిఖన్నా ఇప్పుడు ఇంకో లా కూడా కనిపించాలనుకుంటోందిట. అప్పుడే గ్లామర్ పాత్రలు బోర్ కొట్టాయో లేక కేవలం గ్లామడాల్ గా మిగిలిపోవటం నచ్చలేదో కానీ ఓ నెగటివ్ రోల్ చేయాలన్నది ఆమె కోరికట.. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ. "అవును, నాలో వున్న అసలైన ఆర్టిస్టును బయటకు తీసుకురావాలని వుంది. నెగటివ్ రోల్ చేస్తేనే అలాంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకే, నేను రెడీ .. ఎవరైనా నెగటివ్ రోల్ ఇవ్వండి. ఛాలెంజ్ గా తీసుకుని నా సత్తా చూపిస్తా' అంటూ ఓపెన్ గా చెప్పేసింది.. తనకు అలాంటి నెగటివ్ రోల్స్ సూట్ కావని కొందరు అంటున్నారని, అయితే ఎలాంటివైనా నప్పుతాయన్న విషయాన్ని నిరూపిస్తానని చెప్పింది.

అంతే కాదు పనిలో పనిగా ఒక చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ మీద కొన్ని సెటైర్లు కూడా వేసేసింది. కథాంశాల ఎంపికలో హీరోలకు ఎంతో స్వేచ్ఛ నిస్తారని, కథానాయికలకు మాత్రం ఎన్నో పరిమితులు విధిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది ఈ ఢిల్లీ సుందరి. సినిమాలో తన పాత్ర నచ్చకపోతే నిర్మొహమాటంగా తిరస్కరిస్తానని, అలా గత రెండేళ్లలో దాదాపు డెభ్భైకిపైగా చిత్రాల్ని వద్దనుకున్నానని చెప్పింది.

Rashi khanna Ready To Act In Negative Roles

రాశి మాటల్లోనే చెప్పాలంటే "హీరోయిన్లు తమకు ఇష్టమైన కథల్ని, పాత్రల్ని డిమాండ్ చేసే సందర్భాలు చాలా అరుదుగా వుంటాయి. ఎవరైనా దర్శకుడు చెప్పినట్లుగా చేయాల్సిందే. కానీ నేను మాత్రం నా పాత్ర విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. ఏమైనా మార్పులు అవసరమైతే సూచిస్తాను. క్యారెక్టర్ నచ్చకపోతే బాగాలేదని నిక్కచ్చిగా నా అభిప్రాయాన్ని వెల్లడిస్తాను అని చెప్పింది. అదృష్టం కంటే తన కష్టఫలమే అవకాశాల్ని తెచ్చిపెడుతోందని, స్కూల్ రోజుల నుంచి తాను అన్ని తరగతుల్లో టాపర్‌గా నిలిచానని, ఎంచుకున్న ఏ రంగంలోనైనా ఉత్తమ ప్రతిభ కనబరచాలన్నదే తన లక్ష్యమని చెప్పింది. అంతా బాగనే ఉంది కానీ రెండేళ్ళలో డెబ్బై అవకాశాలను వదులుకోవటం అనే మాటే వింతగా అనిపిస్తోంది మరి... నమ్మొచ్చంటారా..??

English summary
Heroine Rashi Khanna says she is ready to act in Negative roles, she got bored with regular characters, and she has left 70 regular offers .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu