»   » మరోసారి ఆ హీరో హీరోయిన్ జిల్ జిల్ జిగా జిగా!

మరోసారి ఆ హీరో హీరోయిన్ జిల్ జిల్ జిగా జిగా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘జిల్' సినిమా కమర్సియల్ గా పెద్దగా వర్కౌట్ కాకపోయినా...గోపీచంద్, రాశి ఖన్నా మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. త్వరలో ఈ ఇద్దరూ మరోసారి కలిసి చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో తరుణ్‌తో ‘నీ మనసు నాకు తెలుసు' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.

మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఊ లలలా' తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వంలో సినిమాలేవీ రాలేదు. అయితే రీసెంట్‌గా ఓ స్టోరీని గోపీచంద్‌కు వినిపించి ఓకే చేయించుకున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జిల్ సినిమాలో గోపీచంద్, రాశి ఖన్నా జోడీ బాగా కుదరడంతో వారితోనే సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడు.

Rashi Khanna romance with Gopichand again

ప్రస్తుతం గోపీచంద్ చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత 2016లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా సాయి ధరమ్ తేజ్ కు జోడీగా ‘సుప్రీమ్' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు ఆమె నటించిన ‘బెంగాల్ టైగర్' మూవీ విడుదలకు సిద్దమవుతోంది.

ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి రూపొందిస్తున్న సౌఖ్యం సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్య కాలంలో హిట్లకు దూరమైన గోపీచంద్ ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు.

English summary
Director AM Jyothi Krishna of Nee Manasu Naaku Telusu fame has teamed up with actor Gopichand for a new movie. The film will see actress Rashi Khanna as the leading lady.
Please Wait while comments are loading...