»   »  గోకులంలో సీత లంకలోఏం చేస్తుందీ !!? రాశీ లుక్ ఇంత భయంకరంగానా..!? (వీడియో)

గోకులంలో సీత లంకలోఏం చేస్తుందీ !!? రాశీ లుక్ ఇంత భయంకరంగానా..!? (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ హీరోలతో నటించి పెళ్లికి తర్వాత గ్లామర్ ఫీల్డ్‌కు దూరమైన హీరోయిన్ రాశి మళ్లీ తెరంగేట్రం చేసింది. ఇప్పటికే కళ్యాణమే వైభోగమే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన రాశి.. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే కెరీ‌ర్‌ పరంగా రాణించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అమ్మడు "లంక" అనే ఒక కొత్త మూవీలో నటిస్తుంది.

రాశి కీలకపాత్రలో

రాశి కీలకపాత్రలో

రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ "లంక". శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజైన రోజే కొంత ఆసక్తిని క్రియేట్ చేసింది. రాశీ లుక్ చూసి అవాక్కయ్యారంతా.

రాశి పాత్ర చాలా వైవిధ్యంగా

రాశి పాత్ర చాలా వైవిధ్యంగా

ఇందులో రాశి పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని వార్తలు వస్తుండగా వెండతెరపై రాశి మ్యాజిక్ ఎలా వర్కవుట్ అవుతుందనే దానిపై ఆసక్తికర చర్చ కూడా మొదలయ్యింది. ఇక ఆ అంచనాలు అలా సాగుతూందద్గానే ఇదిగో ఇప్పుడు తీజర్ తో దిగిపోయింది లంక యూనిట్...

సస్పెన్స్ థ్రిల్లర్ గా

సస్పెన్స్ థ్రిల్లర్ గా

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రాశీ రోల్ చాల కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది. భారీ క్యాస్టింగ్ మరియు టెక్నీషియన్స్ తో ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

శ్రీ చరణ్ ఈ చిత్రానికి సంగీతం

శ్రీ చరణ్ ఈ చిత్రానికి సంగీతం

శ్రీ చరణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సాయి రోనక్ మరియు ఎనా సహా ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో పాటు మూవీపై మరింత ఆసక్తిని పెంచింది.

టీజర్ చూడగానే త్రిల్లర్ కథాంశం

టీజర్ చూడగానే త్రిల్లర్ కథాంశం

టీజర్ చూడగానే త్రిల్లర్ కథాంశం తో సాగబోతోందనీ, రాశీ పాత్ర మరీ స్పెషల్ గా ఉండబోతోంఫ్దనీ అర్థమయ్యింది. మరి ఇప్పుడు టీజర్ లో ఉన్న సన్నివేశాలకు తగ్గట్టు గా మొత్తం సినిమా ఉన్నట్టయితే తప్పకుండా మంచి విజయాన్నే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చూడాలి మరి "లంక" లో ఏమవనుందో....

రాశి, సాయి రోనక్, ఐనా సాహ, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు, రాజేష్, సత్య, సుదర్శన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్: లెనిన్, డ్యాన్స్: స్వర్ణ, కళ: హరివర్మ, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: వి.రవికుమార్, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.రవిబాబు, పి.ఆర్.ఓ: వంశీశేఖర్, నిర్మాతలు: నామన దినేష్-నామన విష్ణు కుమార్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీముని

English summary
The beautiful yesteryear actress Raashi is coming to entertain the audiences with suspense thriller drama ‘Lanka’ Teaser Released
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu