»   » ఏంటీ పని? : రాజీవ్‌ కనకాలను కొట్టి,రక్కేసిన‘జబర్‌దస్త్‌’ రేష్మి

ఏంటీ పని? : రాజీవ్‌ కనకాలను కొట్టి,రక్కేసిన‘జబర్‌దస్త్‌’ రేష్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రేష్మి తననుకొట్టి రక్కేసిందంటూ రాజీవ్ కనకాల ఫేస్ బుక్ ద్వారా ప్రపంచానికి , విత్ సాక్ష్యం అంటే ఫొటోతో సహా తెలియచేసాడు. అసలు రేష్మి చేత దెబ్బలు తినేంతలాగ రాజీవ్ కనకాల ఏం చేసాడు. చేస్తే చేసాడు...ఆ విషయాన్ని ప్రపంచానికి ఎందుకు తెలపాలనుకున్నాడు..అంటే ...

ఈటీవి సూపర్ హిట్ షో 'జబర్‌దస్త్‌' లో యాంకరింగ్‌ చేస్తూ అదరొకొట్టే రేష్మి గౌతమ్ ఈ మధ్యనే 'గుంటూరు టాకీస్‌'లో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో ఈ బ్యూటీ హాట్‌హాట్‌ అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించింది.

అదే కోవలో ఇప్పుడు 'చారుశీల' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రాజీవ్‌ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్‌లో రాజీవ్‌కనకాలపై రష్మి దాడి చేసిందంట. ఈ విషయాన్ని రాజీవ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'చారుశీల షూటింగ్‌లో రష్మి నాపై దాడి చేసింది. ఏమిటి రష్మిజీ ఇది. ఎవరైనా అడగండి ఏంటి పని' అంటూ రాజీవ్‌ పోస్ట్‌ చేశారు.

ఈ చిత్రంలో రాజీవ్‌ బుగ్గ, నుదుటిపై రక్కేసినట్లు కనిపిస్తోంది. అసలు ఇలా జరగడానికి కారణం ఏమిటా అంటారా...ఎక్కవ ఆలోచించకండి..ఇదంతా సినిమా పబ్లిసిటీలో భాగం..ఇప్పుడు మీకందరికీ రేష్మి, రాజీవ్ కనకాల ఇద్దరూ చారుశీల అనే సినిమాలో నటిస్తున్నారనే విషయం అర్దమైంది కదా..అదే వారి టార్గెట్.

ఇది తెలియటానికే ఖచ్చితంగా రాజీవ్ ఈ పోస్ట్ పెట్టి ఉంటాడు. కాబట్టి అసలు ఏం జరిగిందో రష్మిని అడగటం మొదలుపెట్టకండి. అలాగే ఇంకా ఈ విషయం సుమకు తెలుసో లేదో మరి అంటూ చెప్పటానికి బయిలుదేరకండి.

'గుంటూరు టాకీస్' మూవీలో గ్లామరస్ లుక్ లో మాత్రమే చూసాం. అయితే ఆ సినిమాలో ఆమెకు నటనకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది. అయితే ఆమె తాజా చిత్రం 'చారుశీల'లో మాత్రం రేష్మికి యాక్టింగ్ పరంగా తన టాలెంటును ఓ రేంజిలో చూపించే అవకాశం దక్కింది.

వి.శ్రీనివాసరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. జోత్స్న ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు వి.సాగర్, శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు సంయుక్తంగా నిర్మించిన సినిమా 'చారుశీల'. బ్రహ్మానందం, రేష్మి, రాజీవ్ కనకాల, జశ్వంత్ ముఖ్య తారాగణం.

దర్శకుడు శ్రీనివాస్ వుయ్యూరు మాట్లాడుతూ.. 'థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. మూడేళ్లుగా ప్లాన్ చేస్తున్నాను. సినిమాటోగ్రాఫర్ గా 100 సినిమాలు పూర్తయిన తర్వాత చేయాలనుకున్నాను. మా అన్నయ్య సాగర్ గారికి లైన్ చెప్పగా, మనమే ప్రొడ్యూస్ చేద్దామన్నారు.

Rashmi Gautam attacks Rajeev Kanakala

వీల్ చైర్ లో కూర్చునే పాత్రలో రాజీవ్ కనకాల నటిస్తాడా? లేదా? అని భయపడ్డాను, ఒప్పుకున్నాడు. అద్బుతంగా నటించాడు, రాజీవ్ కనకాల, రేష్మిలకు అవార్డులు వస్తాయి. మా అబ్బాయి ఓ క్యారెక్టర్ చేశాడు. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం' అని అన్నారు.

బ్రహ్మానందం, రేష్మి, రాజీవ్ కనకాల, జశ్వంత్, బెనర్జీ, మెల్కోటే, రాకెట్ రాఘవ, గెటప్ శీను, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటించారు.

ఈ చిత్రానికి మాటలు : కుమార్ మల్లారపు, ఎడిటింగ్ : వి.నాగిరెడ్డి, సంగీతం : సుమన్ జూపూడి, ఆర్ట్ : బాబ్జీ, నిర్మాతలు : వి.సాగర్ & శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు, కథ - స్క్రీన్ ప్లే - సినిమాటోగ్రఫీ - దర్శకత్వం :శ్రీనివాస్ రెడ్డి వుయ్యూరు.

English summary
Rajeev Posted.. My position after Rashmi Gautam’s attack in #Charuseela frown emoticon.What is this #Rashmi Ji ?????? Somebody ask her, what is this ?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu