»   »  ‘జబర్దస్త్' రేష్మి లిప్ లాక్ పెట్టి హీటెక్కించింది (వీడియో)

‘జబర్దస్త్' రేష్మి లిప్ లాక్ పెట్టి హీటెక్కించింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రేష్మి, శ్రద్దాదాస్ లను హాట్ గా చూపిస్తూ, కొంచెం ఎ టైప్ సీన్స్ తో హిట్ కొట్టాలనుకుంటున్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తార్. ఆయన చందమామ కథలు చిత్రం తర్వాత రూపొందింస్తున్న ‘గుంటూరు టాకీస్' చిత్రం ఓ క్రైమ్ కామెడీగా రెడీ అవుతోంది. ఈ చిత్రం దియోటర్ ట్రైలర్ విడుదలైంది. దానికి సంబందించిన వీడియో ఇక్కడ చూడండి.

ఇప్పటికే సుమారు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబందించి ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స వేగంగా సాగుతున్నాయి. గుంటూర్ టాకీస్ సినిమా కన్ ప్యూజింగ్ కామెడీ అని, ఈ సినిమా అంతా సింగీతం శ్రీనివాసరావ్ డైరక్షన్ వహించి, కమల్ హాసన్ హీరోగా నటించిన మైకిల్ మదన కామరాజు వలె , ఈ సినిమా లైన్ వుంటుందని అనుకుంటున్నారు.

Rashmi's Guntur Talkies theatrical trailer

ఇంకా ఈ చిత్రానికి సంబందించి ఇష్కియా, డీల్లి బెల్లీ తరహాలో మాదిరి రెండు క్యారక్టర్స్ అయిన హరి మరియు 25 సంవత్సరాలున్న కేసనోవా పాత్రల్లో సిద్దు మరియు గిరి నటిస్తున్నారు. శ్రధ్దా దాస్ రాడికల్ రోల్ నటిస్తుండగా, మహేష్ మజ్రేకర్ కూడా బ్యాడీగా కనిపించనున్నారు. వాళ్ళూ ఈ సినిమాలో సొంత వాయిస్ ను వుపయోగించనున్నారు.

Rashmi's Guntur Talkies theatrical trailer

దర్శకుడు మాట్లాడుతూ ''చందమామ కథలు తరవాత చేస్తున్న చిత్రమిది. ఆ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. అందుకే నాపై మరింత బాధ్యత పెరిగింది. ఓ సామాజిక స్పృహతో తెరకెక్కుతున్న చిత్రమిది. సందేశంతో పాటు వినోదమూ ఉంటుంది''అన్నారు.

''ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు. లక్ష్మీ మంచు, రఘుబాబు, తాగుబోతు రమేష్‌, అపూర్వ తదితరులు నటిస్తున్నారు.ఛాయాగ్రహణం: రామిరెడ్డి.పి, కూర్పు: ధర్మేంద్ర కాకరాల.

English summary
Jabardasth anchor Rashmi Gautam and Siddhu, Shraddha Das, Naresh starring a new generation comedy movie Guntur Talkies official theatrical trailer released
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu