For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పొద‌ల చాటు వ్యవహారం చూస్తే ఊరుకుంటారా..? అది టాప్ సీక్రెట్: రష్మిక

  |

  కన్నడ భామ రష్మిక మందన్న వెండితెరపై ఎంత చురుకుగా ఉంటుందో.. బయట జరిగే మీడియా సమావేశాల్లో కూడా అంతే చురుకుగా మాట్లాడుతుంటుంది. ఆమె ప్రెసెంట్ మూవీ 'డియర్ కామ్రేడ్' ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక చిత్రంలోని లిప్‌లాక్స్‌పై మరోసారి స్పందించింది. ముద్దు సీన్ల గురించి మోడ్రెన్‌గా అందరికీ అర్ధమయ్యే స్టైల్‌లో ఆమె చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు లిప్‌లాక్స్‌పై మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ ఈ సారి ఏమందో చూద్దామా..

  క్రేజీ జోడీ విజయ్ దేవరకొండతో..

  క్రేజీ జోడీ విజయ్ దేవరకొండతో..

  ఛలో అంటూ తెలుగు తెరపై అడుగుపెట్టిన రష్మిక మందన్నకు 'గీతా గోవిందం' సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. విజయ్ దేవరకొండ సరసన ఆమె చూపిన అభినయం ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో విజయ్- రష్మిక మధ్య కుదిరిన కెమిస్ట్రీ, లిప్‌లాక్ సీన్స్ తెలుగు తెరపై వీరిది క్రేజీ జోడీ అనే ముద్ర వేసేశాయి. అయితే ఇప్పుడు డియర్ కామ్రేడ్ రూపంలో మరోసారి ఈ క్రేజీ జోడీ ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

  డియర్ కామ్రేడ్ లిప్‌లాక్స్.. హీరో హీరోయిన్ రెస్పాన్స్

  డియర్ కామ్రేడ్ లిప్‌లాక్స్.. హీరో హీరోయిన్ రెస్పాన్స్

  ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన 'డియర్ కామ్రేడ్' సినిమా టీజర్ లోనే ఇంకోసారి ఈ క్రేజీ జోడీ లిప్‌లాక్స్ చూపించి సినిమాపై హైప్ తీసుకొచ్చారు దర్శకనిర్మాతలు. వర్షంలో తడుస్తూ రష్మిక పెదాలపై విజయ్ దేవరకొండ పెట్టిన ముద్దు తెగ వైరల్ అయిపోయింది. సోషల్ మీడియా అంతా ఈ సీన్ పోస్టర్స్ మాత్రమే కనిపించాయి. అంతేకాదు విజయ్ దేవరకొండ, రష్మిక కనిపించారంటే చాలు వాళ్ళిద్దరి లిప్ లాక్స్ గురించే అడుగుతున్నాయి మీడియా వర్గాలు.

  గతంలో చాలాసార్లు విజయ్, రష్మిక ఇద్దరూ

  గతంలో చాలాసార్లు విజయ్, రష్మిక ఇద్దరూ

  అయితే ముద్దుసీన్లపై ఇప్పటికే విజయ్, రష్మిక చాలాసార్లు స్పందించారు. కథలో భాగంగానే లిల్లి, బాబీ క్యారెక్టర్స్ లో లీనమై కిస్సులు పెట్టుకున్నాం తప్ప.. విజయ్, రష్మికలు కిస్ చేసుకుంటున్నట్లుగా అస్సలు ఉహించుకోలేదని చెప్పారు. అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఈ సన్నివేశాలపై క్రేజ్ తగ్గలేదు, అనుమానాలు నివృత్తి కాలేదు. తాజాగా మరోసారి రష్మికకు అదే ప్రశ్న ఎదురుకావడంతో ఈ సారి కాస్త ఆసక్తికరంగా స్పందించింది.

  పొద‌ల చాటు వ్యవహారం చూస్తే

  పొద‌ల చాటు వ్యవహారం చూస్తే

  విజయ్, నేను లిప్‌లాక్స్ చేశామా లేక అది కెమెరా ట్రిక్కు మాత్రమేనా అనేది సీక్రెట్‌గా ఉంచాలి. అది బయటకు చెప్పే విషయం కాదు. పాత సినిమాల్లో లాగా హీరోయిన్ ముద్దు సీన్ అన‌గానే పొద‌ల చాటు వ్యవాహారాలు, పువ్వులు ఊగ‌డం లాంటివి చూపిస్తే నేటి తరం ప్రేక్ష‌కులు ఊరుకుంటారా? అందుకే ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డుతున్నామ‌ని ర‌ష్మిక మందన్న తెలిపింది.

  డియర్ కామ్రేడ్ మూవీ

  డియర్ కామ్రేడ్ మూవీ

  నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కింది 'డియర్ కామ్రేడ్' మూవీ. 'ఫైట్ ఫర్ వాట్ యు లవ్' అనేది ట్యాగ్ లైన్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని జులై 26న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

  English summary
  Rashmika Mandanna is doing her movies rapidly. Now she was acting in Dear Comrade movie with Vijay Deverkonda. This movie will release on july 26th. In this movie pramotions Rashmika Mandanna reacted about Liplock seens.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X