»   » తేల్చి చెప్పాడు: “రధం” టైటిల్ బన్ని కోసం కాదు

తేల్చి చెప్పాడు: “రధం” టైటిల్ బన్ని కోసం కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి "రధం" టైటిల్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు మీడియాలోనూ ఈ టైటిల్ విస్తృతంగా ప్రచారం అయ్యింది. కానీ బన్ని అభిమానులు మాత్రం ఈ టైటిల్ వంక అనుమానంగా చూసారు. ఇలాంటి టైటిల్ తో బన్ని సినిమా తెరకెక్కటమేంటి అనుకున్నారు. ఈలోగా.. దర్శకుడు బోయపాటి శ్రీను ...ఈ టైటిల్ తన చిత్రానికి సంభందించింది కాదని తేల్చి చెప్పారు.

బోయపాటి శ్రీను మీడియా వర్గాలతో మాట్లాడుతూ..." రథం టైటిల్ వేరే సినిమా కు అనుకున్నది. బన్ని సినిమా కోసం పవర్ ఫుల్ టైటిల్ అనుకున్నాం. త్వరలోనే అది రివిల్ చేస్తాం. అలాగే ఇప్పటివరకూ హీరోయిన్ సైతం ఫైనలైజ్ కాలేదు " అని అన్నారు. ఈ చిత్రం రవితేజతో గతంలో చేసిన భధ్ర తరహాలో యాక్షన్‌తో కూడిన ప్రేమకథ చిత్రంగా తెరకెక్కనుందని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

”Ratham” is not Bunny’s title: Boyapati Srinu

ఇక సన్నాఫ్ సత్యమూర్తితో మంచి హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. రీసెంట్ గా బోయపాటి జన్మదిన వేడుకను గీతా ఆర్ట్స్ ఆఫీసులో నిర్వహించారు.

దాంతో ఈ సినిమా ఉంటుందని హింట్ వచ్చింది. ఇప్పటికే కథ చర్చలు కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని మే రెండో వారంలో ప్రారంభించనున్నారట. హైవోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

హిందీలో పాపులర్ అయిన టీవీ నటి సోనారికా ఈ చిత్రంలో హరోయిన్ గా చేసే అవకాశం ఉంది. సోనారిక ప్రస్తుతం తెలుగులో నాగ శౌర్య సరసన ‘జాదూగాడు' చిత్రంలో నటిస్తోంది. ఇదే ఆమె తొలి సినిమా. అందం, పర్ ఫెక్ట్ ఫిజిక్, యాక్టింగ్ టాలెంట్ ఉండటంతో బోయపాటి దృష్టిలో పడింది. అల్లు అర్జున్ కూడా ఆమెను ఓకే చేసినట్లు టాక్.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ .. అల్లు అర్జున్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేషన్ లో చిత్రం చేయాల‌ని చాలా రోజుల నుండి అనుకుంటున్నాం. బోయ‌పాటి శ్రీను చెప్పిన క‌థ నాకు, బ‌న్ని కి బాగా న‌చ్చి మా బ్యాన‌ర్ గీతాఆర్ట్స్ లో చేస్తున్నాం. అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వుంటూ ప్యూర్ ల‌వ్ స్టోరి మిక్స్ అయిన క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నామని తెలిపారు.

బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ.. బ‌న్ని తో సినిమా ఎప్పుడో చేయాల్సింది. బ‌న్ని బాడీ లాంగ్వేజ్ కి స‌రిపోయో క‌రెక్ట్ క‌థ సిధ్ధంచేశాను. అర‌వింద్ గారు, బ‌న్ని ఈ క‌థ విని వెంట‌నే ఓకే చేశారు. ప‌క్కా అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వున్న స్టోరి, హీరోయిజం వుంటూనే ల‌వ్ స్టోరి వుంటుంది. ఈచిత్రం లో కొత్త బ‌న్ని క‌న‌ప‌డ‌తాడనేది ఖ‌చ్చితంగా చెప్పగల‌ను అన్నారు.

English summary
“We haven’t zeroed on Ratham. That is for another movie. A powerful title is fixed for Bunny’s flick and we’ll reveal that soon. No, a heroine is also not finalized”, said Boyapati
Please Wait while comments are loading...