For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెగిపోయిన సుకుమార్, రత్నవేలు బంధం.. తనను తీసుకోకపోవడంపై కెమెరామెన్ రియాక్షన్.. వైరల్ అవుతోన్న ట్వీట్

  |

  సుకుమార్ సినిమాను పట్టాలెక్కిస్తున్నారంటే.. అందులో మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ ఎవరు? అనే విషయాన్ని ఎవ్వరూ అడగవలసిని పని లేదు. సుక్కు ఏ సినిమా చేసినా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు కెమెరా కన్ను ఉండాల్సిందే. అంతలా ఈ త్రయం ఫేమస్ అయ్యారు. ఆర్య దగ్గరినుంచి మొదలైన ఈ కాంబినేషన్.. చివరగా వచ్చిన రంగస్థలం వరకు కొనసాగింది.

  కల్ట్ క్లాసిక్‌గా మిగిలిన రంగస్థలం..

  కల్ట్ క్లాసిక్‌గా మిగిలిన రంగస్థలం..

  రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంలో దర్శకుడు సుకుమార్ పాత్ర ఎంత ఉందో.. మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవీ పార్ట్, సినిమాటోగ్రఫర్‌గా రత్నవేలు భాగస్వామ్యం కూడా అంతే ఉంది. ఈ ముగ్గురు కలిసి చేస్తూ ఉన్న ప్రతీసారి ఏదో కొత్త మ్యాజిక్ మాత్రం క్రియేట్ అవుతూనే వస్తోంది. వీరి కాంబినేషన్‌లో చివరగా వచ్చిన రంగస్థలం తెలుగులో కల్ట్ క్లాసిక్‌గా మిగిలిపోయింది.

  రంగస్థలం తరువాత గ్యాప్..

  రంగస్థలం తరువాత గ్యాప్..

  రంగస్థలం తరువాత మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు చాలా సమయమే తీసుకున్న సుక్కు... సూపర్‌స్టార్ మహేష్ బాబుతో సినిమా ఓకే అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఆ మూవీ క్యాన్సల్ అయింది. అటుపై బన్నీతో ప్రాజెక్ట్ ఫిక్స్ కాగా.. నిన్న (అక్టోబర్ 30) లాంచనంగా ప్రారంభించారు.

  మైత్రీ మూవీస్ బ్యానర్‌లో..

  మైత్రీ మూవీస్ బ్యానర్‌లో..

  రంగస్థలం చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీస్.. సుకుమార్ తదుపరి చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు బుధవారం జరగ్గా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

  తొలిసారి విడిపోయిన బృందం..

  ఆది నుంచి కలిసి చిత్రాలు చేస్తోన్న సుకుమార్, దేవీ, రత్నవేలు కాంబినేషన్‌కు బ్రేక్ పడింది. అల్లు అర్జున్‌తో సుకుమార్ తెరకెక్కించబోయే ఈ చిత్రంలో సంగీత దర్శకుడిగా దేవీని ఫిక్స్ చేసిన యూనిట్.. రత్నవేలుకు మాత్రం చాన్స్ ఇవ్వలేదు. దీనిపై స్పందిస్తూ.. రత్నవేలు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

  మరో కల్ట్ క్లాసిక్ కావాలి..

  మరో కల్ట్ క్లాసిక్ కావాలి..

  అల్లు అర్జున్‌తో తెరకెక్కించే ఈ చిత్రం రంగస్థలంలా మరో కల్ట్ క్లాసిక్ కావాలి.. ఆల్ ది బెస్ట్ సుకుమార్.. ఈ సారి మనం ఒకర్నొకరు మిస్ అవుతున్నాము.. మళ్లీ తదుపరి చిత్రానికి కలుసుకుందాం.. అల్లు అర్జున్, మైత్రీ, దేవీ ప్రసాద్, మోనిక రామకృష్ణ, కుబా అందరికీ బెస్ట్ విషెస్ అంటూ ట్వీట్ చేశాడు.

  ఈ చిత్రానికి రత్నవేలును కెమెరామెన్‌గా తీసుకోకపోవడానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. రత్నవేలు మరేతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడా.. లేక ఏమైనా మనస్పర్థలు వచ్చాయా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటించనుంది. షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల పూజా కార్యక్రమానికి రాలేకపోయానని సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

  English summary
  Sukumar Started A Project With Allu Arjun. Rathnavelu Reaction On Did No Given Chance In That Movie. All the best for #AA20. Expecting another Cult classic hit like Rangasthalam!! Both of us are gonna miss each other this time. See you in the next movie. Best wishes to alluarjun, MythriOfficial, ThisIsDSP, kuba Dop, Monika Ramkrishna
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X