»   » ఒళ్ళంతా గాయాలు.., ముఖం నిండా రక్తం., ఆసుపత్రిలో రవీనాటాండన్.., సినిమాలోనే...

ఒళ్ళంతా గాయాలు.., ముఖం నిండా రక్తం., ఆసుపత్రిలో రవీనాటాండన్.., సినిమాలోనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కంగారు పడకండి....ఈ ఫోటో రవీనా నటిస్తున్న ది మదర్ సినిమాలోనిది. ఆప్టర్ సయ్యద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్. ఇందులో రవీనా తల్లి పాత్రలో కనిపించనుంది. లైంగిక వేధింపులకు గురయ్యే ఆడవారికి న్యాయం జరగాలంటూ రోడ్డుపై ధర్నాలు చేసే నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ విషయంలో మహిళలకు నూరు శాతం న్యాయం జరగడంలేదు కాబట్టి దీనిని ప్రధాన అంశంగా సమాజానికి చూపించబోతున్నారు. హాలీవుడ్‌ చిత్రం 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' ఫేం మధుర్‌ మిట్టల్‌ విలన్‌ పాత్రలో కన్పించనున్నాడు. ఏప్రిల్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓ జనరేషన్ వెనక బాలీవుడ్ ని అలరించిన బ్యూటీస్ లో రవీనా టాండన్ ఒకరు. ఈ మధ్య సినిమాలు తగ్గించేసింది కానీ.. ఈ భామకి ఇప్పటికీ క్రేజ్ విపరీతంగానే ఉంటుంది. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేస్తోంది. ప్రస్తుతం ది మదర్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Raveena Tandon's ‘The Mother’ First look

తాజాగా మదర్ చిత్రంలోంచి ఓ ఫోటోని విడుదల చేసింది యూనిట్. కళ్ల నిండా ధారలుగా కారుతున్న నీళ్లు.. చెరిగిపోయిన జుట్టు.. రక్తం ఓడుతున్న తల.. పెదాల నుంచి ధారలుగా కారుతున్న రక్తం.. చూడగానే రక్తపు మడుగులో రవీనా టాండన్ ఏంటి అనిపించి.. కొంత భయపెట్టేసేలా ఉంది ఫోటో. ది మదర్ మూవీలో రవీనా టాండన్ తల్లి పాత్రలో నటించనుండగా.. లైంగిక వేధింపులకు గురయ్యే మహిళల తరపున పోరాటం చేసే పాత్రలో ఈమె నటిస్తోంది.

చాలాకాలం తర్వాత మళ్ళీ సినిమాల్లో నటిస్తున్న రవీనా ఇప్పుడు వయసుకు తగ్గ పాత్రలతోనే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ పాత్రలు కూడా వైవిధ్య భరితంగా ఉంటేనేనత. ఇప్పుడు వస్తున్న మథర్ కూడా పూర్తి మెసెజ్ తో కూడుకున్న చిత్రమే. మొన్నటికి మొన్న వచ్చిన పింక్ కూడా మహిళల మీద దాదులు అనాగరికం అన్న మేసేజ్ తోనే రాగా... ఇప్పుడు మదర్ కూడా ఇంచుమించు అలాంటి మెసేజ్ నే ఇస్తుందంటున్నారు.

English summary
The first look of Raveena Tandon-starrer ‘The Mother’ has been released. The is all set to hit theatres on April 21. Actress Raveena Tandon is essaying the role of a mother in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu