»   » అల్లరి రవిబాబు నెక్ట్స్ చిత్రం విశేషాలు

అల్లరి రవిబాబు నెక్ట్స్ చిత్రం విశేషాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

భూమిక, స్నేహాలతో చేసిన ధ్రిల్లర్ అమరావతి వికటించటతో అల్లరి రవిబాబు కొంత గ్యాప్ తీసుకుని ఓ ప్రేమ కథా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కేరళ బ్యాక్ డ్రాప్ లో మొదలయ్యే ఈ చిత్రం ఏప్రియల్ 25 నుంచి ప్రారంభంకానుంది. ఓ ప్రముఖ నిర్మాత కుమారుడు ఈ చిత్రంలో హీరోగా ఉండనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కొత్త చిత్రానికి స్క్రిప్టు వర్క్ ఆయన ఆఫీసులో జరుగుతోంది. కంటెన్యూ షెడ్యులతో ఈ చిత్రం పూర్తి చేయాలని, హీరోయిన్ గా కొత్త అమ్మాయిని పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక రవిబాబు ప్రస్తుతం ప్రతీ రోజు అనే చిత్రంలో చేస్తున్నారు. అతని సరసన బిందుమాధవి హీరోయిన్ గా చేస్తోంది. రాజు రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్యామ్ ప్రసేన్ సంగీతం అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu