»   » హీరోయిన్ పూర్ణతో ఎఫైర్ గురించి దర్శకుడు రవిబాబు

హీరోయిన్ పూర్ణతో ఎఫైర్ గురించి దర్శకుడు రవిబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''నాకంటూ కొన్ని నియమాలున్నాయి. సినిమా పూర్తయిపోయాక ఆ సినిమా గురించి గానీ, అందులో పని చేసే నటీనటుల గురించిగానీ ఆలోచించను. ఫోనులోనూ మాట్లాడను. సాయంత్రం అయితే నా సహాయ దర్శకులతోనూ నేను టచ్‌లో ఉండను. నా జీవితం నాదే. పూర్ణ మంచినటి. సెట్లో ఆమె అంత ఏకాగ్రత ప్రదర్శించే హీరోయిన్ ని నేనింత వరకూ చూళ్లేదు. అందుకే ఆమెకు అవకాశాలిచ్చాను. అమ్మాయిలతోనే కాదు, అబ్బాయిలతోనూ నాకు ఎలాంటి సంబంధాలూ లేవు (నవ్వుతూ)'' అని రవిబాబు చెప్పుకొచ్చారు. ' హీరోయిన్ పూర్ణతో మీరు చాలా సన్నిహితంగా ఉంటున్నారట. అందుకే ఆమెకు అవకాశాలిస్తున్నారట' అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలా చెప్పారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అయినా నేను భూమికతో మూడు సినిమాలు చేశాను. ఇప్పుడు పూర్ణతో మూడు సినిమాలు చేశాను. నేనో రూల్‌ పెట్టుకున్నా. షూటింగ్‌కు పేకప్‌ చెప్పాక ఏ రోజూ నేను నా సినిమాలో చేసిన ఏ హీరోయిన్‌కూ కాల్‌ చెయ్యలేదు. అంతేకాదు. ఆ టైమ్‌లో హీరో హీరోయిన్ల నుంచి కానీ, నా అసిస్టెంట్‌ దగ్గర నుంచి కానీ ఫోన్లు వస్తే రిసీవ్‌ చేసుకోను. ఈ రూల్‌ను నేను మొదట్నించీ పాటిస్తూ వస్తున్నా. నా లైఫ్‌ ఓపెన్‌ బుక్‌ లాంటిది. నేనలాంటి వాణ్ణయితే, ఆ హీరోయిన్లు నాతో రెండో సినిమా చెయ్యరు కదా అన్నారు.


అవును సీక్వెల్ గురించి మాట్లాడుతూ...


Ravi Babu opens up on his alleged link-up with Poorna

''అవును' కథ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే 'అవును 2' ప్రారంభం అవుతుంది. దీన్ని సీక్వెల్‌ అనడం కంటే పార్ట్‌ 2 అనడం సబబు. మనం బుల్లితెరలో ధారావాహికలు చూస్తుంటాం. ఈరోజు కథ ఓ చోట ఆగుతుంది. రేపు అక్కడి నుంచే మొదలవుతుంది. ఈ సినిమా కూడా అంతే! 'అవును' తెరకెక్కించేటప్పుడే రెండో భాగం తీయాలని అనుకొన్నాం. అందుకే కథని అర్ధాంతరంగా ఆపేశాం.


'అవును 2' ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకొంటే మూడో భాగం తీస్తామేమో? తొలి భాగంలో చూసిన పాత్రలు, ఆ కథ రెండో భాగంలోనూ కొనసాగుతాయి. కొత్త పాత్రలూ చేరాయి. సంజన, నిఖిత, రవి వర్మ పాత్రలు ప్రవేశించాయి. పార్ట్‌ 1 చూసిన వాళ్లకి దెయ్యం ఎవరో తెలుసు, కథేంటో తెలుసు. అలాంటి వాళ్లకీ పార్ట్‌ 2 ఆసక్తిని రేకెత్తించేలా ఉండాలి. అదే నాకు ఎదురైన పెద్ద సవాల్‌'' అని చెప్పుకొచ్చారు.


డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘అవును-2 సినిమాను రవిబాబు చాలా వైవిధ్యంగా తెరకెక్కించాం. పార్ట్‌ 1 కంటే 2 ఇంకా బావుంటుంది. హారర్‌ సినిమాలను ఎంజాయ్‌ చేయాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారు. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.


హారర్‌, థ్రిల్లర్‌ చిత్రాల్ని తెరకెక్కించడంలోనూ సిద్ధహస్తుడు అనిపించుకొన్నారు. ఇప్పుడు 'అవును 2'తో మరోసారి భయపెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


నిఖిత, సంజన, చక్రవర్తి, రవివర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు స్ర్కీన్‌ప్లే: సత్యానంద్‌, కెమెరా: ఎన్‌.సుధాకర్‌రెడ్డి, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటర్‌: మార్తాండ్‌.కె.వెంకటేశ్‌, ఆర్ట్‌: భూపే్‌శ ఆర్‌.భూపతి, రచన, నిర్మాత, దర్శకత్వం: రవిబాబు.

English summary
When asked about how he responds to the rumour about his alleged link-up with Poorna, Ravi Babu said "You should ask actresses about this, not me.I've worked with Bhoomika for three films, Poorna for three films and also with Yami. My relationship with actresses is strictly professional. I can't understand from where these rumours come from. Actually I don't care about what people talk or write about me. If someone finds pleasure in writing these kind of rumours, I would be actually happy".
Please Wait while comments are loading...