»   » షాక్ : ATM వద్ద పందిపిల్లను పట్టుకుని క్యూలో రవిబాబు (ఫొటో)

షాక్ : ATM వద్ద పందిపిల్లను పట్టుకుని క్యూలో రవిబాబు (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రతీది పబ్లిసిటీ కోసం అనే పాలసీ సినిమా జనాలిది. లేకపోతే పందిపిల్లని పట్టుకుని, దర్శక,నిర్మాత, నటుడు రవిబాబు..ఎటిఎం వద్ద కనపడటం ఏమిటి..ఇప్పుడు సిని వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు. రవిబాబు చేతిలో ఓ బుజ్జి పందిపిల్లను పట్టుకుని నిలబడటం అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది.

పూర్తి విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం దేశం మొత్తం.. ఏటీఎమ్ సెంట‌ర్ల ద‌గ్గ‌రా, బ్యాంకుల ద‌గ్గ‌రే క‌నిపడుతున్నారు. అంతేకాదు అక్కడ నిలబడ్డ కాసేపు..నోట్ల రద్దు నిర్ణయం, ఎటిఎం కష్టాలు గురించి చర్చలు జరుపుతున్నారు. వీటిని తన కొత్త సినిమా పబ్లిసిటీ కోసం వాడుకుంటే ఎలా ఉంటుంది అనే ఐడియా రవిబాబుకు వచ్చినట్లుంది. అందుకే ...ఆయన ఇలాంటి పని చేసారు.

హైద‌రాబాద్‌లోని శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలోని ఓ ఏటీఎమ్ సెంట‌ర్ ముందు ర‌విబాబు చేతిలో పందిపిల్లను పట్టుకుని క్యూలో నిల‌బ‌డ్డాడు. సర్లేండి ఎంత పబ్లిసిటీ కావాల్సి వస్తే మాత్రం పందిపిల్లను ఎత్తుకుని రావటం ఏమిటి అంటారా...దానికి ఓ రీజన్ ఉంది. మీకు ఇప్పటికి గుర్తు రాకపోతే మేమే చెప్పేస్తాం.

షాకింగ్

షాకింగ్

ర‌విబాబు పందిపిల్ల‌ ప్రధాన పాత్రలో ‘అదిగో' అనే ఓ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమాలో దాదాపు పందిపిల్లే చేస్తోంది. అంటే హీరో, విల‌న్‌, క‌మెడియ‌న్ అన్నీ ఆ పందిపిల్లే. ఇప్పుడు ఆ పందిపిల్ల‌తోనే ఏటీఎమ్ ముందు క్యూ క‌ట్టి తన సినిమాని గుర్తు చేస్తున్నాడన్నమాట. మీడియా కూడా .... ర‌విబాబుని ఇలా చూసి షాక్ అయ్యి ప్రచారం ఇస్తుంది కదా..అదే ఆయనకు కావాల్సింది కదా.

టైటిల్ తోనే

టైటిల్ తోనే

ఇక తొలి చిత్రం అల్లరి మొదలు నచ్చావులే, నువ్విలా, అవును, లడ్డుబాబు వంటి సినిమాల్లో ఆయన శైలి సుస్పష్టం. ఇలాంటి సులభైమన తెలుగు పేర్లు పెట్టడంలో జంధ్యాల, ఈవీవీ తర్వాత ఆ స్థానం రవిబాబుదే అని చెప్పుకోవచ్చు. ‘అవును2', ‘లడ్డుబాబు' సినిమాల తర్వాత రవిబాబు తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘అదిగో'.

పందితో ఎందుకని...

పందితో ఎందుకని...

ఓ పంది పిల్ల ప్రధాన పాత్రలో ఆయన ఈ సినిమాని రూపొందించడం విశేషం. దీనికోసం పందులపై రీసెర్చ్ చేసిన రవిబాబు కొన్నాళ్ళపాటు ఓ పందిపిల్లని పెంచారట. కుక్క, పిల్లి, గుర్రం, కోతి వంటి జంతువులతో సినిమా చేయగా లేనిది పందితో ఎందుకు చేయకూడదు అని ఏడాదిన్నర క్రితం వచ్చిన ఓ ఆలోచనకు సినిమా రూపమిచ్చే ప్రయత్నంలో ఏడేళ్ళ పాటు శ్రమించి ఓ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయించారట.

టెక్నాలిజీ వాడి

టెక్నాలిజీ వాడి

హాలీవుడ్ స్థాయిలో ఇలాంటి సినిమాలకు ఉపయుక్తమయ్యే టెక్నాలజీ ఉన్నప్పటికీ బడ్జెట్ పరిమితుల వల్ల ఈ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయించారు. అది పూర్తయ్యాక సినిమా షూటింగ్ ఆరంభించినా కొన్ని సాంకేతిక సమస్యల వల్ల మరో రెండు నెలల పాటు వాయిదా వేయాల్సి వచ్చిందట.

త్వరలోనే...

త్వరలోనే...

ఇలా కొన్ని సమస్యలు ఎదురైనా తన ఆలోచనకి తెరరూపమిచ్చేశారు రవిబాబు. ఎప్పట్లానే ఈ సినిమాతోను అభిషేక్, నాబ అనే ఇద్దరు కొత్త నటులను పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదలకానుంది.

English summary
people gathered at an ATM on Tuesday saw a unique site when well known director, actor and producer Ravi Babu lined up in front of the machine with his pet piglet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu