Just In
- 15 min ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 46 min ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 1 hr ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 2 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- News
సుప్రీం ఒప్పుకున్నా సహాయనిరాకరణే ?పంచాయతీపై ఉద్యోగుల వ్యూహమిదే- అదెలా లీకైంది ?
- Finance
మార్చి తర్వాత రూ.5, రూ.10, రూ.100 నోట్లు చెల్లవా? ప్రభుత్వం ఏమంటోంది
- Lifestyle
ఇంట్లో మీ రక్తపోటును తనిఖీ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన 7 విషయాలు
- Sports
India vs England: ప్రేక్షకుల మధ్య టీ20 సిరీస్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇద్దరు వేశ్యలను టార్చర్ పెడుతున్న రవిబాబు!
హైదరాబాద్ : దర్శకుడు, నటుడు రవిబాబు ఇద్దరు వేశ్యలను టార్చర్ పెట్టడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. కొంపతీసి ఇది రియల్ లైఫ్‌లో అనుకునేరు. ఇదంతా రీల్ లైఫ్‌లో మాత్రమే. కామెడీ విలన్ పాత్రలకు బాగా పాపులర్ అయిన రవిబాబు త్వరలో విడుదల కాబోతున్న పవిత్ర, ప్రేమ ఒక మైకం చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించబోతున్నాడు.
పవిత్ర చిత్రంలో హీరోయిన్ శ్రీయ వేశ్య పాత్రలో నటిస్తుండగా, ప్రేమ ఒక మైకం చిత్రంలో హీరోయిన్ చార్మి వేశ్యగా దర్శనం ఇవ్వనుంది. ఈ రెండు చిత్రాల్లో విలన్ రోల్ చేస్తూ....ఆ ఇద్దరు వేశ్యలను తెగ టార్చర్ పెట్టబోతున్నాడు రవిబాబు. భారీ పర్సనాలిటీతో భయంకరమైన విలనిజం పండించడంతో పాటు, ఫన్సీ చేష్టలతో కామెడీ చేయడం రవిబాబు ప్రత్యేకత.
శ్రీయ టైటిల్ రోల్‌లో జనార్ధన మహర్షి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పవిత్ర'. ఉప శీర్షిక 'ఎ బోల్డ్ అండ్ గోల్డ్ ఫిల్మ్'. కె. సాదక్ కుమార్, జి. సాయి మహేశ్వర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదకు సిద్ధం అవుతోంది. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.
చార్మి వేశ్య పాత్రలో నటిస్తున్న చిత్రం 'ప్రేమ ఒక మైకం'. టెన్త్ క్లాస్, నోట్ బుక్ చిత్రాల దర్శకుడు చందు దర్శకత్వంలో టూరింగ్ టాకీస్ పతాకంపై డి. వెంకట సురేష్, కె. సూర్య శ్రీకాంత్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ్యాపీడేస్ ఫేం రాహుల్, ప్రేమిస్తే శరణ్య ఇందులో జంటగా నటిస్తున్నారు.