»   » 'ప్రతి రోజు' కొత్తగా...బిందు మాధవి, రవిబాబు

'ప్రతి రోజు' కొత్తగా...బిందు మాధవి, రవిబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అవకాయ్‌ బిర్యానీ' పరిచయమై 'బంపర్‌ ఆఫర్‌', ఓం శాంతి చిత్రాలతో సెటిలయిన భామ బిందు మాధవి. ఆమె త్వరతో ఓ థ్రిల్లింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సినిమా పేరు 'ప్రతి రోజు'. యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రవిబాబు ముఖ్యపాత్ర చేశారు. రాజు రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో నాగేందర్‌ వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ...బిందు మాధవి, రవిబాబు పాత్రల చిత్రణ కొత్తగా...ఆసక్తిదాయకంగా ఉంటుంది' అంటున్నారు. అలాగే టైటిల్‌ను బట్టే ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చునని, ఇందులోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులు థ్రిల్‌ ఫీలయ్యే విధంగా ఉంటుంది. ఛాయాగ్రహణం, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం అన్నారు. చలపతిరావు, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాశ్ ‌రెడ్డి, ఆయేషా జలీల్‌, దువ్వాసి మోహన్‌, హేమ, హర్షవర్థన్‌, 'చిత్రం' భాషా, 'సత్యం' రాజేశ్‌, రాజ్యలకి, తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: శామ్‌ప్రసేన్‌, కెమెరా: వంశీ, నిర్మాణం: ప్రకాశ్‌ వి.ప్రొడక్షన్స్‌.

Please Wait while comments are loading...