సామాన్యుడు డైరక్టర్ రవిచావలి నెక్ట్స్ చిత్రం డిటేల్స్...
జగపతి బాబుతో సామాన్యుడు అనే చిత్రం తీసి విజయం సాధించిన రవి చావలి ఆ తర్వాత విక్టరీ చిత్రంతో చల్లబడ్డారు. అయితే తాజాగా ఆయన సుమంత్ హీరోగా మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు. అసమాన్యుడు అనే టైటిల్ తో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నాగార్జునతో శ్రీనివాస రెడ్డి దర్సకత్వంలో ఢమురుకం చిత్రం చేస్తున్నారు. ఇక సుమంత్ కూడా రాజ్, గోల్కొండ హై స్కూల్ ప్లాపులతో నిరాశగా ఉన్నారు. ఈ స్ధితిలో ఈ కొత్త సినిమా అతనిలో ఉత్సాహాన్ని నింపిందని ఆయన శ్రేయాభిలాషులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఆర్.ఆర్ వారు నాగచైతన్యతో కూడా ఆటో నగర్ సూర్య చిత్రం చేస్తున్నారు. దేవకట్టా దర్సకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇలా వరసగా అక్కినేని కుటుంబంతో వారు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే నాగార్జున కుమారుడు అఖిల్ ని పరిచయం చేసే భాధ్యతను కూడా ఆర్.ఆర్ వారే తీసుకోనున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











