»   » ‘కిక్-3’ కూడా ప్లాన్ చేస్తాం: రవితేజ

‘కిక్-3’ కూడా ప్లాన్ చేస్తాం: రవితేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ర‌వితేజ‌-సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌లో ‘కిక్' అప్ప‌ట్లో ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌. దాదాపు ఆరేళ్ల గ్యాప్ త‌ర్వాత అదే కాంబినేష‌న్‌లో ఈ హిట్ సినిమాకు సీక్వెల్‌గా కిక్ 2 వ‌స్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మించిన ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న ర‌కుల్‌ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆగస్టు 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న రవితేజ ఆసక్తికర విషయం వెల్లడించారు.

‘కిక్-2' సినిమా భారీ విజయం సాధిస్తే ‘కిక్-3' ప్లాన్ చేస్తామని రవితేజ తెలిపారు. సెన్సార్ బోర్డు నుండి ఈ చిత్రం ‘U/A' సర్టిఫికెట్ పొందింది. ముందుగా ఈ సినిమాకు ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. అయితే అసంతృప్తి వ్య‌క్తం చేసిన నిర్మాత క‌ళ్యాణ్‌రామ్ ప‌ట్టుబ‌ట్టి రివైజింగ్ క‌మిటీకి వెళ్లి ‘U/A' సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. సినిమా బాగా రావ‌డంతో క‌ళ్యాణ్ రామ్ ఫుల్ హ్యాపీగా ఉన్న‌ారు.


ఇటీవ‌ల రిలీజ్ అయిన రెండో ట్రైల‌ర్‌కు కూడా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది. కిక్ సినిమాలోని ర‌వితేజ‌-ఇలియానాల కొడుకు స్టోరీయే కిక్ 2 సినిమా. వ‌క్కంతం వంశీ స్టోరీ అందించిన ఈ సినిమాకు ఎస్ఎస్‌.థ‌మ‌న్ సంగీతం అందించారు. స్లైడ్ షోలో రవితేజ చెప్పిన ఆసక్తికర విషయాలు....


బరువు తగ్గడంపై...

బరువు తగ్గడంపై...

ఈ మధ్య రవితేజ చాలా బరువు తగ్గి సన్నగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ... నేను బరువు తగ్గింది ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కాదు, పర్సనల్ ఫిట్ నెస్, హెల్తీ లైఫ్ స్టైల్ కోసమే అని స్పష్టం చేసారు.


డిఫరెంట్

డిఫరెంట్

కిక్ సినిమాకు, కిక్ 2 సినిమాకు ఎలాంటి పొంతన ఉండదు, స్టోరీ పూర్తిగా డిఫరెంటుగా ఉంటుందన్నారు రవితేజ.


రాబిన్ హుడ్ పాత్ర..

రాబిన్ హుడ్ పాత్ర..

కిక్ 2 చిత్రంలో తాను రాబిన్ హుడ్ పాత్రలో నటించానని, పూర్తి డిఫరెంటుగా, ఆసక్తికరంగా ఉంటుందని రవితేజ తెలిపారు.


బాహుబలి వల్లే ఆలస్యం..

బాహుబలి వల్లే ఆలస్యం..

ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా... పోస్టు ప్రొడక్షన్ పనులు లేటవ్వడం, బాహుబలి విడుదల కావడంలో లేటయిందన్నారు.


వెంకీతో ప్రాజెక్టు రద్దయింది

వెంకీతో ప్రాజెక్టు రద్దయింది

వెంకీ, రవితేజ కలిసి సినిమా చేయడానికి సిద్దమయ్యారు. ఆ సినిమా వర్కౌట్ కాక పోవడంతో రద్దయిందని రవితేజ తెలిపారు.


English summary
"If everything goes on quite well and becomes a huge hit, there would definitely be Kick 3." Ravi Teja said.
Please Wait while comments are loading...