»   » సూపర్ ఫన్ అంటూ...అతని గురించి రవితేజ ఇలా (ఫోటో)

సూపర్ ఫన్ అంటూ...అతని గురించి రవితేజ ఇలా (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘కిక్-2' చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతని తో కలిసి పని చేయడం చాలా సంతోసంగా ఉందంటూ రవితేజ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా సంతోషం వెలుబుచ్చారు.

టిపికల్ కామిక్ టైమింగ్, వెరైటీ మేనరిజం, బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూయించడం రాజ్ పాల్ యాదవ్ ప్రత్యేకత. ఇప్పటి వరకు బాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన రాజ్ పాల్ కిక్-2 ద్వారా టాలీవుడ్లోనూ నవ్వించడానికి వచ్చాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాలో అతని పాత్రను ప్రత్యేకంగా తీర్చి దిద్దాడని తెలుస్తోంది.

Ravi Teja about Raaj pal Yaadav

చిత్రంలో రవితేజ గత చిత్రాలకు భిన్నంగా కనిపించబోతున్నాడు. ఇందులో రవితేజ తండ్రి, కొడుగా డబల్ రోల్ చస్తున్నాడు. పాత్రలో వైవిద్యం చూపడానికి రవితేజ ఏకంగా 6 కేజీల బరువు తగ్గిపోయాడు. అయితే ఈ మధ్య పలు ప్రెస్ మీట్లలో కనిపించిన రవితేజ మరీ బక్కచిక్క కనిపించడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఎలాంటి ఆందోళన అవసరం లేదని, సినిమా పాత్ర కోసమే ఇదంతా అంటున్నారు యూనిట్ సభ్యులు.

రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇపుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా రవితేజ హీరోగా నటించే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు.

With #RaajpalYaadav from the sets of #Kick2. It was super fun acting with him

Posted by Ravi Teja on Monday, April 13, 2015

ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అంటున్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. కథ:వక్కంతం వంశి, కెమెరా:మనోజ్ పరమహంస, సంగీతం:తమన్, నిర్మాత:నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకత్వం:సురేందర్ రెడ్డి.

English summary
"With RaajpalYaadav from the sets of #Kick2. It was super fun acting with him" Ravi Teja said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu