»   » ట్విన్స్ గా రవితేజ డ్యూయిల్ రోల్

ట్విన్స్ గా రవితేజ డ్యూయిల్ రోల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రవితేజ త్వరలో ట్విన్స్ గా డ్యూయిల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. అయితే ఈ చిత్రం తెలుగులో కాదు..హిందీలో రూపొందనుంది. రవితేజ బాలీవుడ్‌ రంగ ప్రవేశం చేయనున్నాడంటూ గత కొన్ని రోజులగా వస్తున్న వార్తలు నిజమవుతున్నాయి. ఆయన నటించే తొలి హిందీ కన్ఫర్మ్‌ అయింది. సుమీర్‌ కార్నిక్‌ దర్శకత్వంలో రవితేజ నటించే చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఇక ఈచిత్రం టైటిల్ 'కౌర్‌ అండ్‌ సింగ్‌'గా పెట్టారని తెలుస్తోంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తాడని, కవల సోదరులుగా రెండు పాత్రల్లో కనిపిస్తాడని దర్శకుడి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రాన్ని ఏకకాలంలో హిందీ, తెలుగు భాషల్లో నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రవితేజ తన బాల్యాన్ని ఉత్తరభారతంలో గడిపినందున హిందీ భాషలో అనర్గళంగా మాట్లాడతాడు. బాలీవుడ్‌ సినిమా విషయంలో ఇది అతనికి బాగా కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలని అంటున్నారు.

బలుపు విజయంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ త్వరలో బాలీవుడ్ కు ప్రయాణం కట్టనున్నారని సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ దర్శకుడు సమీర్ కార్నిక్ (యమాలా పగ్లా దీవానా, హీరోస్..) రవితేజను కాంటాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. రవితేజ డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని త్వరలో బాలీవుడ్ లో తన మార్క్ తో లాంచ్ అవ్వనున్నారని చెప్తున్నారు.

రవితేజ, శృతి హాసన్ జంటగా పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పివిపి సినిమా పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'బలుపు'. ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 28న విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించింది. ప్రసాద్ వి.పొట్లూరి తమ బేనర్లో నిర్మించిన తొలి తెలుగు చిత్రంతోనే సక్సెస్ సాధించడం గమనార్హం. మరో వైపు బలుపు చిత్రం రవితేజ కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలించిది.

English summary
Ravi Teja is all set to enter Hindi films through the movie 'Kaur And Singh'. This will be directed by Samir Karnik, the man who delivered flicks like Yamla Pagla Deewana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu