»   » వేణు శ్రీరామ్, రవితేజ కాంబినేషన్ టైటిల్ అదా?

వేణు శ్రీరామ్, రవితేజ కాంబినేషన్ టైటిల్ అదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కిక్ 2' కు ముందు సినిమా వేగాన్ని తగ్గించిన రవితేజ మళ్లీ దూకుడును పెంచారు. ఆయన ప్రస్తుతం బెంగాల్‌టైగర్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన మరో చిత్రానికి పచ్చజెండా ఊపారు. ఓ మై ఫ్రెండ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వేణు శ్రీరామ్‌తో రవితేజ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకి ‘ఎవడో ఒకడు' అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఇటీవలే ఈ టైటిల్ ని దిల్ రాజు ఫిలిం చాంబర్ లో రిజిష్టర్ చేయడానికి కూడా కారణం అదే అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

వినూత్న కాన్సెప్ట్‌తో దర్శకుడు చెప్పిన కథలోని కొత్తదనం నచ్చడంతో ఆయన ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలిసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ప్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నటు సమాచారం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్‌పైకి తీసుకురానున్నారు.

raviteja,dil raju

బెంగాళ్ టైగల్ విషయానికి వస్తే...

ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా సాంగ్స్ షూటింగ్ యూరప్ లో జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేసి అక్టోబర్ చివర్లో లేదా నవంబర్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంపత్ నంది మాట్లాడితే... పులి పంజా విసిరిందంటే ఇక తిరుగులేనట్టే. అదే పులి ఓ పథకం ప్రకారం పంజా విసిరితే? పౌరుషమున్న ఒక పులి అదే చేసింది. మరి అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు సంపత్‌ నంది.

దర్శకుడు కంటిన్యూ చేస్తూ.. ''పేరుకు తగ్గట్టుగా బలమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. యాక్షన్‌, భావోద్వేగాలు, వినోదం మేళవించి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. రవితేజ హుషారైన నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. బెంగాల్‌ టైగర్‌ అంత పవర్‌ రవితేజ పాత్రలో కనిపిస్తుంది'' అన్నారు.

''చిత్రీకరణ తుదిదశకు చేరుకొంది. రవితేజ శైలి మాస్‌ అంశాలతో దర్శకుడు సంపత్‌ నంది చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం చాలా బాగుంది. మా సంస్థలో నిలిచిపోయే ఓ మంచి చిత్రమవుతుంది'' అన్నారు నిర్మాత.

రచ్చతో దర్శకుడుగా తన సత్తా ఏంటో చూపించిన దర్శకుడు సంపత్ నంది.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. రవితేజ హీరోగా నటిస్తున్నారు. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్స్. కె.కె.రాధామోహన్‌ నిర్మాత.

English summary
Ravi Teja will act in the direction of ‘Oh My Friend’ fame Venu Sriram. This film is titled Yevado Okadu.
Please Wait while comments are loading...