»   » రవితేజ 'రొమాంటిక్ రుషి' నిజమేనా?

రవితేజ 'రొమాంటిక్ రుషి' నిజమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ త్వరలో రొమాంటిక్ రుషి గా కనిపంచనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన చేయనున్న చిత్రానికి ఈ గమ్మత్తైన టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మార్చి 25న లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభం కానుంది. శేఖర్ కమ్ముల లీడర్ చిత్రంతో పరిచయమైన రిచా ఉపాధ్యాయ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. యల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ...హరీష్ శంకర్ చెప్పిన కథ ఎక్సలెంట్ గా ఉంది. మేము ఎక్కడా ప్రొడక్షన్ విలువల్లో కాంప్రమైజ్ కాదల్చుకోలేదు. భారీ బడ్జెట్ లోనే ఈ చిత్రం రూపొందిస్తాము అంటున్నారు. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఆర్ డి రాజశేఖర్ కెమెరా అందిస్తున్న ఈ చిత్రానికి కిక్ చిత్రానికి సంగీతం అందించిన తమస్ సంగీత సారధ్యం వహిస్తున్నారు. గౌతం రాజు ఎడిటింగ్, రామ్ లక్ష్మన్ యాక్షన్ కోసం ఎంపిక జరిగింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu