Don't Miss!
- News
ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్లో రూ. 12,800 కోట్లు: వాటాలు ఇలా, కీలక ప్రాజెక్టులు
- Sports
ILT20 2023: 6 బంతుల్లో 5 సిక్స్‌లు.. డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ చేసిన యూసఫ్ పఠాన్!
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Dhamaka Twitter Review: ధమాకాకు అలాంటి టాక్.. అసలైందే మైనస్‌గా.. రవితేజ మూవీ హిట్టా? ఫట్టా?
చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయినా.. గత ఏడాది 'క్రాక్'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. అయితే, ఈ సంవత్సరం మాత్రం ఈ మాస్ హీరో వరుసగా 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి భారీ డిజాస్టర్లను ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో రవితేజ 'ధమాకా' అనే సినిమాలో నటించాడు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి దీనికి ట్విట్టర్ టాక్ ఎలా వచ్చిందో చూద్దామా?

ధమాకా అంటూ వచ్చిన స్టార్
రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రమే 'ధమాకా'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శ్రీలీలా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ దీనికి సంగీతం అందించాడు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రలు చేశారు.
సారా అలీ ఖాన్ హాట్ వీడియో వైరల్: రెడ్ బికినీలో ఎద అందాల ప్రదర్శన

అలాంటి కథ... అన్నింటితో
రవితేజ సినిమాలు అంటేనే అన్ని హంగులూ కనిపిస్తూ ఉంటాయి. 'ధమాకా'లోనూ ఇదే ఫాలో అయ్యారు. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి.. ఓ బడా కంపెనీకి సీఈవోగా మారి కార్పోరేట్ దిగ్గజాలను ఎలా ఎదుర్కొన్నాడు? అసలు అతడు ఎందుకలా రెండు పాత్రలు చేయాల్సి వచ్చింది? అనే అంశాలతో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీపై అంచనాలు మాత్రం భారీ స్థాయిలో ఏర్పడాయి.
|
ట్విట్టర్‌లో మూవీకి టాక్ ఇలా
రవితేజ నటించిన 'ధమాకా' మూవీ ఎన్నో అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా ఏరియాల్లో ఈ సినిమా షోలు పడ్డాయి. దీంతో ట్విట్టర్ వేదికగా చాలా మంది ఈ సినిమాపై తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. నెటిజన్ల నుంచి మాత్రం ఈ సినిమాకు కొన్ని మైనస్‌లతో కూడిన మంచి టాక్ దక్కుతోంది.
|
ఫస్టాఫ్ ఎలా ఉందో చెబుతూ
రవితేజ నటించిన 'ధమాకా' మూవీ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్రదర్శితం అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ తాజాగా ఈ చిత్రం ఫస్టాఫ్ ఎలా ఉందో ట్వీట్ చేశారు. అందులో 'స్టోరీ అండ్ స్క్రీన్‌ప్లే ఫ్లాట్‌గా ఉంది. కానీ, సాంగ్స్, కామెడీ, కొన్ని అదిరిపోయే సన్నివేశాలతో దీన్ని ఆసక్తికరంగా మార్చారు. ఇందులో రవితేజ ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి' అంటూ చెప్పుకొచ్చారు.
|
సెకెండాఫ్ అలా.. క్లైమాక్స్‌లో
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ధమాకా' మూవీని వీక్షించిన ఇంకో నెటిజన్ దీనిపై అభిప్రాయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించాడు. 'ఓవరాల్‌గా ధమాకా మూవీ బాగుంది. ఫస్టాఫ్, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నాయి. సెకెండాఫ్‌లో వచ్చే క్లైమాక్స్ పార్ట్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అదిరిపోయాయి' అంటూ సదరు నెటిజన్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
|
రవితేజ.. శ్రీలీలా గురించి
'ధమాకా' మూవీలో రవితేజ, శ్రీలీల జంటగా నటించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఇందులో ఇరగదీసేశారని అంటున్నారు. నెటిజన్లు ముఖ్యంగా మాస్ మహారాజా వన్ మ్యాన్ షో చేశాడని, శ్రీలీలా క్యూట్ లుక్స్‌తో పాటు యాక్టింగ్‌తో ఆకట్టుకుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'రవితేజ, శ్రీలీలా సాంగ్స్‌లో ఎనర్జీ వేరే లెవెల్. బ్రిలియంట్ యాక్టింగ్' అని ట్వీట్ చేశాడు.
|
ఆ ముగ్గురు గురించి కూడా
రవితేజ నటించిన 'ధమాకా' మూవీని వీక్షించిన వాళ్లంతా ముగ్గురు గురించి పాజిటివ్‌గా ట్వీట్లు చేస్తున్నారు. అందులో దర్శకుడు త్రినాథరావు నక్కినను ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో లేపుతున్నారు. వింటేజ్ రవితేజను చూపించాడని ప్రశంసిస్తున్నారు. అలాగే, దీనికి డైలాగ్స్ అందించిన ప్రసన్నతో పాటు మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్‌పై మాస్ మహారాజా ఫ్యాన్స్ ప్రేమను కురిపిస్తున్నారు.
|
పదేళ్ల క్రితమే చూశామని
మాస్ కాంబోలో రూపొందిన 'ధమాకా' మూవీని చూసిన మరో నెటిజన్ ఇలా ట్వీట్ చేశాడు. అందులో 'ధమాకా ఓవరాల్‌గా రొటీన్‌గా సాగే కాలం చెల్లిన కథతో వచ్చిన సినిమా. ఇది ఎక్కువ శాతం పెద్దగా ఎంటర్‌టైన్ చేయదు. ఇందులో కొన్ని సీన్లు, మ్యూజిక్ మాత్రమే బాగున్నాయి. మిగిలినవి ఇరిటేట్ చేస్తాయి. ఈ సినిమా పదేళ్ల క్రితమే చూసినట్లు అనిపిస్తుంది' అని చెప్పాడు.

అసలైందే మైనస్ అంటూ
'ధమాకా'
మూవీని
చూసిన
మరో
నెటిజన్
ఇందులో
ప్లస్‌లు,
మైనస్‌లను
వివరిస్తూ
ట్వీట్
చేశాడు.
దీని
ప్రకారం..
ఈ
సినిమాలో
వింటేజ్
రవితేజ
మాస్
డైలాగులు,
శ్రీలీలా,
సాంగ్స్,
ప్రీ
క్లైమాక్స్,
హైపర్
ఆది
-
రావు
రమేష్
సీన్స్
ప్లస్
పాయింట్లుగా
నిలిచాయట.
అలాగే,
రొటీన్
స్టోరీ,
ఊహించదగ్గ
సన్నివేశాలు
మైనస్‌గా
మారాయని
చెప్పాడు.
మొత్తంగా
కథ
గురించి
ఇదే
టాక్
వచ్చింది.