»   » ‘డాన్ శీను’ రవితేజ ఇప్పుడేం చేస్తున్నాడు?

‘డాన్ శీను’ రవితేజ ఇప్పుడేం చేస్తున్నాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ, త్రిష కాంబినేషన్ లో రూపొందుతున్న 'డాన్ శీను" చిత్రం నానక్‌ రామ్‌ గూడాలోని రామానాయుడు సినీ విలేజ్‌లో రెగ్యులర్ షూటింగ్ తో ప్రారంభమయింది. ఫిబ్రవరి 19నుంచి రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించారు. మార్చి 20వరకు హైదరాబాద్‌ లో జరుగుతుంది. సెకండ్ షెడ్యూల్ ఏప్రిల్ 1నుంచి స్విట్జర్లాండ్, పెయన్ దేశాల్లో జరుగనుంది .ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పాట చిత్రీకరణ జరుపుకుంటోంది.

గతంలో 'దుబాయ్ శీను' గా అలరించిన రవితేజ ఈసారి 'డాన్ శీను' గా అవతరిస్తున్నాడు.ఇందలో రవితేజ పాత్ర అమితాబ్ బచ్చన్ సూపర్ హిట్ డాన్ చిత్రానికి వీర ఫ్యాన్. ఎప్పుడూ ఆ చిత్రంలోని డైలాగులు చెబుతూ మై హూ డాన్ అంటూ తిరుగుతూంటాడని తెలుస్తోంది. గోపీచంద్ మలినేనిని డైరక్టర్ గా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని కె అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్.మూవి మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ-"మంచి ఎంటర్‌టైనింగ్ ఫిలిం చేస్తున్నాం. 'కిక్" తర్వాత ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్‌ లో నటించడం చాలా ఆనందంగా వుంది"అన్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ-'డాన్ శీను'లో రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో అవన్నీ ఇందులో వుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందన్న నమ్మకం మాకుంది"అన్నారు.

ఇక ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో షాయాజీషిండే, బ్రహ్మానందం, అలీ, సునీల్, రఘుబాబు, కృష్ణ భగవాన్, నాజర్, బ్రహ్మాజీ, దువ్వాసి మోహన్, ఢిల్లీ రాజేశ్వరి, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి పాటలు..సీతారామశాస్ర్తీ, రామజోగయ్య శాస్ర్తీ అందిస్తూంటే, స్క్రీన్‌ప్లే, మాటలు..కోన వెంకట్ ఇస్తున్నారు. కొరియోగ్రఫీ: రాజు సుందరం, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: గౌతంరాజు, కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: మణిశర్మ సమకూరుస్తున్నారు. సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: వెంకట్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu