»   » కిక్-2 థియేటర్లో ప్రేక్షకులు వీరంగం, తెర చించివేత

కిక్-2 థియేటర్లో ప్రేక్షకులు వీరంగం, తెర చించివేత

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనగాం: రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిక్ 2' సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ విడుదలైంది. వరంగల్ జిల్లా జనగాంలోని దేవీ థియేటర్‌లో కిక్-2 సినిమా ప్రదర్శితం అవుతుండగా సాంకేతిక కారణాలతోకు అంతరాయం ఏర్పడింది. దీంతో అభిమానులు ఆగ్రహాంతో ఊగిపోయారు. థియేటర్‌లో తెరను చింపివేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

కాగా ఈ రోజు విడుదలైన ‘కిక్-2' సినిమా మూవీ మిక్డ్స్ టాక్ సొంతం చేసుకుంది. మాస్ ప్రేక్షకలు మెచ్చేలా సినిమా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గతంలో రవితేజ-సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘కిక్' సినిమాకు సీక్వెల్. అయితే ఈ సినిమా ‘కిక్' రేంజిలో కిక్ ఇవ్వలేదనే వాదన సైతం వినిపిస్తోంది.


Ravi Teja Fans attacked theater

మాస్ మహారాజా రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సంగీతం: యస్.యస్.థమన్, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేంద్ రెడ్డి.


సినీ డిస్ట్రిబ్యూటర్ కారు, డబ్బు చోరీ....
గుంటూరుకు చెందిన సినీ డిస్ట్రిబ్యూటర్‌ వాసుదేవరావరావు కారు, రూ 20 లక్షలు చోరీకి గురయ్యాయి. డ్రైవర్ సాయి డబ్బు, కారుతో సహా ఉడాయించాడు. ఈమేరకు వాసుదేవరావరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు

English summary
Ravi Teja Fans attacked theater in Janagam.
Please Wait while comments are loading...