»   » వరుడు డైరెక్టర్ ‘కత్తి’ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ రాజా రవితేజ

వరుడు డైరెక్టర్ ‘కత్తి’ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ రాజా రవితేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్‌ రాజా రవితేజ, డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ ల ఫస్ట్‌ కాంబినేషన్‌ లో ఓ ప్రముఖ యువ నిర్మాతకు సంబంధించిన అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం 'కత్తి" త్వరలో ప్రారంభం అవుతుంది. 'ఇడియట్‌, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, ఖడ్గం, విక్రమార్కుడు, కృష్ణ, కిక్‌" వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల హీరో రవితేజ, 'సొగసు చూడతరమా, రామాయణం, చూడాలని వుంది, ఒక్కడు, అర్జున్‌, వరుడు" వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల దర్శకుడు గుణశేఖర్‌ కలిసి చేస్తున్న తొలిచిత్రం ఇది. ఈ చిత్రం గురించి దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతూ... 'కత్తి" అనే టైటిల్‌ తో ఓ స్టైలిష్ మాస్‌ ఎంటర్‌ టైనర్‌ ని రవితేజ హీరోగా రూపొందిస్తున్నాను. 'కత్తి" టైటిల్‌ లో ఎంత ఫోర్స్‌, ఎంత జోష్‌ వున్నాయో ఈ స్క్రిప్ట్‌లో కూడా అంత జోష్‌, అంత ఫోర్స్‌ వున్నాయి. 'కత్తి" లాంటి క్యారెక్టర్‌ కు రవితేజ పర్‌ ఫెక్ట్‌ గా సూట్‌ అవుతారు. నా దర్శకత్వంలో ఇంతకుముందు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఓ కొత్త జోనర్‌ లో ఈ చిత్రం వుంటుంది. 'కత్తి" కథ వినగానే రవితేజ ఎంతో ఎక్సైట్‌ అయ్యారు. ఈ స్టైలిష్ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ కు యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌ చేస్తున్నారు. యువన్‌ తో నేను ఫస్ట్‌ టైమ్‌ చేస్తున్నాను" అని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu