అప్పట్లో నేను, గుణశేఖర్, రవితేజ ఒకే గదిలో అద్దెకు
ఒకప్పుడు నేను, గుణశేఖర్, రవితేజ ఒకే గదిలో అద్దెకు ఉంటూ సినిమా రంగంలో ఎదగడానికి ప్రయత్నాలు చేసే వాళ్లం. ఇప్పుడు మా ముగ్గురి కలయికలో 'నిప్పు' సినిమా రూపొందడం ఆనందంగా ఉంది అన్నారు దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి. రవితేజ హీరోగా వైవీఎస్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుణశేఖర్ దర్శకుడు. స్వర్గీయ ఎన్టీ రామారావు జన్మదినం సందర్భంగా మే 28న ఈ చిత్రం ప్రారంభం కాబోతుంది. ఈ విషయం వివరిస్తూ..సినిమాపై ఉన్న అభిమానం నన్ను ఈ స్థాయికి తెచ్చింది. ఆ అభిమానం నాకు కలగడానికి కారణం స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు. ఈ పుట్టిన రోజు సందర్భంగా ఆ మహానుభావుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ అభిమానంతోనే సరిగ్గా 27ఏళ్ల క్రితం ఇంజినీరింగ్ చదువుకి స్వస్తిచెప్పి దర్శకత్వ శాఖలో చేరాను. 13 ఏళ్ల పాటు కె.రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు, మహేష్‌భట్, రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ లాంటి దిగ్గజాల దగ్గర పనిచేశాను. ఈ రోజు నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయమే అన్నారు దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి.


Click it and Unblock the Notifications











