For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమ్మ చాలా కుంగిపోయింది.. ఆ సంఘటనలు బాధించాయి.. మీడియా తీరు బాధకరం.. రవితేజ

  By Rajababu
  |
  Ravi Teja Speak To Media About His Personal Life ఆ సంఘటనలు నన్ను బాధించాయి..

  టాలీవుడ్‌లో మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటించిన చిత్రం రాజా ది గ్రేట్. ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సందర్భంగా రవితేజ పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇటీవల ఆయన జీవితంలో చోటుచేసుకొన్న డగ్ర్స్ కేసు, సోదరుడి మరణం, వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను పంచుకొన్నారు. రవితేజ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

   అందుకే గ్యాప్ వచ్చింది..

  అందుకే గ్యాప్ వచ్చింది..

  ఏడాది కాలంగా చాలా గ్యాప్ వచ్చింది. ప్రేక్షకులను, అభిమానులను మెప్పించే చిత్రాలు చేయాలన్న ఉద్దేశంతోనే మంచి కథలపై దృష్టిపెట్టాం. కొన్ని కథలు అనుకొన్నా ఎందుకు సెట్స్ మీదకు వెళ్లలేకపోయాయి. అందుకే గ్యాప్ వచ్చింది.

   అనిల్ చెప్పిన కథ విని..

  అనిల్ చెప్పిన కథ విని..

  రాజా ది గ్రేట్ చిత్రంలో అంధుడి పాత్రను పోషిస్తున్నాను. దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన కథ నన్ను బాగా ఆకట్టుకొన్నది. అతనిపై ఉన్న నమ్మకంతోనే నేను ఈ చిత్రాన్ని చేస్తున్నాను. పటాస్ కథ ముందు నాకే చెప్పాడు. కొన్ని కారణాల వల్ల చేయలేక పోయాను. ఆ తర్వాత దిల్ రాజు సూచన మేరకు మళ్లీ నాకు ఈ చిత్ర కథ చెప్పాడు. కథ వినగానే చాలా ఎక్సైట్ అయ్యాను. అందుకే అంధుడి పాత్రను సవాల్‌గా తీసుకొని చేస్తున్నాను.

   అంధుల ప్రతిభ చూసి

  అంధుల ప్రతిభ చూసి

  రాజా ది గ్రేట్ చిత్రంలో అంధుడి పాత్ర కోసం కొంత రీసెర్చ్ చేశాను. చాలా విషయాలపై దృష్టిపెట్టాను. చిన్న జియ్యర్ స్వామి స్కూల్‌లో చిన్నారులను చూశాక ఈ పాత్రకు స్ఫూర్తి కలిగింది. వేదిక మీద ప్రదర్శన ఇచ్చేటప్పుడు వాళ్లు చూపిన ప్రతిభ ఆకట్టుకొన్నది. అంధుల్లో నిస్తేజంగా ఉంటారను కోవడం తప్పు. కానీ వాళ్లలో మనకంటే ఎక్కువ ఆత్మ విశ్వాసం ఉంటుంది అని తెలుసుకొన్నాను.

   ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీల్

  ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీల్

  సినిమాలో వైవిధ్య ఉన్నప్పుడే ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీల్ అవుతారు. ప్రేక్షకులకు మూస చిత్రాలు చూసి విసుగు వచ్చింది. కొత్తదనం లేకుంటే ప్రేక్షకులు థియేటర్‌కు రావడం లేదు. బాగా ఉంటేనే ఆడియెన్స్ థియేటర్లకు వస్తున్నారు.

  నా కుమారుడితో కలిసి

  నా కుమారుడితో కలిసి

  రాజా ది గ్రేట్‌కు మరో ప్రత్యేకత ఉంది. ఈ చిత్రంలో నా కుమారుడితో కలిసి నటిస్తున్నాను. ఈ చిత్రం ద్వారా సినిమా పరిశ్రమకు నా కుమారుడు పరిచయం అవుతున్నాడు. దర్శకుడు అనిల్ సూచన్ మేరకు మా అబ్బాయి చేత ఓ మంచి పాత్ర చేయించాం. ఈ చిత్రంలో నా కుమారుడు చిన్నప్పటి రవితేజగా నటించాడు. అందరూ బాగుందని అంటున్నాను. ఇంకా మా అబ్బాయి నటించిన సీన్లను చూడలేదు.

  ఆరోపణలు ఎందుకు వచ్చాయో

  ఆరోపణలు ఎందుకు వచ్చాయో

  నా జీవితంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనలతో చాలా ఇబ్బంది పడ్డాను. ఈ ఆరోపణలు ఎందుకు వచ్చాయో తెలియడం లేదు. జీవితంలో ఓ భాగం అనుకొని వాటిని ఎదుర్కొన్నాన. మీడియాలో ఎవరికీ తోచినట్టుగా వారు కథనాలు రాయడం మరీ ఇబ్బంది పెట్టింది.

   అమ్మ చాలా కుంగిపోయింది

  అమ్మ చాలా కుంగిపోయింది

  డ్రగ్స్, తమ్ముడి మరణం నన్ను నా కుటుంబాన్ని చాలా బాధ కలిగించాయి. మా అమ్మ చాలా కుంగిపోయింది. ఇప్పుడిప్పుడే చేదు సంఘటనల నుంచి బయటపడుతున్నారు. నేను చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందినప్పుడు కూడా అంతగా బాధపడలేదు. డ్రగ్స్‌ కేసు విషయంలో కావాలని కొన్ని ఛానెళ్లు ప్రత్యేక కథనాలు రాశాయి. దానికి మాత్రం చాలా బాధపడ్డా. త్వరలోనే ఆ విషయంపై నేనే మీడియా ముందుకొచ్చి వివరణ ఇద్దామనుకుంటున్నాను.

  English summary
  Raviteja's Latest movie is Raja the great. This movie slated to release on October 18th. In this occassion, Ravi teja speak to media about his latest movie and his personal life. Raviteja said he excited about Anil Ravipudi story.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X