For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కొత్తదనం కోసం ప్రయత్నిస్తే దెబ్బ పడింది.. అందుకే ఆ సినిమాలు ఫ్లాప్.. రవితేజ

  By Rajababu
  |
  కొత్తదనం కోసం చూస్తే దెబ్బే... అందుకే ఆ సినిమాలు ఫ్లాప్ !

  మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం టచ్ చేసి చూడు. రవితేజ ఎనర్జీకి తగినట్టుగా ఉన్న టైటిల్‌తో ఫిబ్రవరి 2 ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన సీరత్ కపూర్, రాశీఖన్నా నటించారు. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని రవితేజ తెలుగు ఫిల్మ్ బీట్‌తో మాట్లాడారు. రవితేజ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

  టచ్ చేసి చూడు చిత్రం

  టచ్ చేసి చూడు చిత్రం

  టచ్ చేసి చూడు చిత్రం ఏ రేంజ్ చిత్రం అనేది ఫిబ్రవరి 2వ తేదీన తెలుస్తుంది. గతంలో పోలీస్ పాత్రలను వేశాను. కానీ ఈ చిత్రంలో చిన్న ఫన్, కొంత వివేకం, మరికొంత వ్యంగ్యం కలిసి ఉన్న కొత్త పోలీసును చూస్తారు. ఓ రకంగా చెప్పాలంటే సీరియస్ పోలీస్ పాత్ర. దాంతో పాటు ఫ్యామిలీని బ్యాలెన్స్ ఎలా చేస్తాడనే పాత్ర స్వభావం. డ్యూటి మైండ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర.

  వక్కంతం వంశీ అందించిన

  వక్కంతం వంశీ అందించిన

  రచయిత వక్కంతం వంశీ అందించిన కథను విక్రమ్ బాగా డీల్ చేశాడు. క్లియర్‌గా, స్పష్టంగా నా నుంచి ఏం రాబట్టుకోవాలో అది తీసుకొన్నారు. డైరెక్షన్ చేసేటప్పుడు అతని అంకితభావం బాగా నచ్చింది. కొత్త డైరెక్టర్ అని ఎక్కడా అనిపించలేదు. అతను ఎప్పటి నుంచో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు. వీవీ వినాయక్ వద్ద పనిచేశాడు.

  విక్రమ్‌తో అనుబంధం

  విక్రమ్‌తో అనుబంధం

  నాకు మిరపకాయ్ నుంచి విక్రమ్‌తో అనుబంధం ఉంది. నాకు ముందు ఓ కథ చెప్పాడు. వేరే ప్రాజెక్ట్ కారణంగా ఆయన చెప్పిన కథను చేయలేకపోయాను. ఈ లోపు వక్కంతం వంశీ వచ్చి కథ చెప్పడం బుజ్జికి ఓకే కావడం, ఆ తర్వాత ఆ కథను విక్రమ్ అభిరుచికి తగినట్టు, స్టయిల్‌లో రూపొందించాడు. కథలో క్లారిటీ ఉంది.. కన్‌ఫ్యూజన్ ఉంటే కన్‌ఫ్యూజన్ ఫీలవుతాం.

  సీరత్ కపూర్‌ గురించి

  సీరత్ కపూర్‌ గురించి

  టచ్ చేసి చూడు చిత్రంలో సీరత్ కపూర్‌ది డామినేటింగ్ క్యారెక్టర్. మోడరన్ అమ్మాయిలా కనిపిస్తుంది. సిటీ నేపథ్యం ఉన్నయువతిగా సీరత్ నటించింది. ఈ చిత్రంలో సీరత్ పాత్ర చాలా బాగుంటుంది.

  హీరోయిన్ రాశీఖన్నా..

  హీరోయిన్ రాశీఖన్నా..

  ఈ చిత్రంలో మరో హీరోయిన్ రాశీఖన్నా. రాశీది మెచ్చ్యూర్డ్ క్యారెక్టర్‌. నేను ఊహించినదానికన్నా ఎక్కువగా నటించింది. ఆమె మంచి నటి. అవకాశం వస్తే తన ప్రతిభను బయటపెట్టుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. రాశీ తన ప్రతిభను బయటపెట్టుకోవడానికి టచ్ చేసి చూడు ఓ చక్కని అవకాశం.

  మ్యూజిక్ డైరెక్టర్ గురించి

  మ్యూజిక్ డైరెక్టర్ గురించి

  ప్రీతమ్ చక్రవర్తి జామెట్ అనే మ్యూజిక్ కంపెనీ పెట్టారు. అందులో సభ్యులు ఇచ్చిన ట్యూన్స్‌ను, సౌండ్ తీసుకొన్నాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మ అందించారు. రీరికార్డింగ్‌లో మణిశర్మ మాస్టర్. ఈ సినిమాకు బాగా మ్యూజిక్ చేశారు.

  గత పదేళ్లకుపైగా ఓకే రకం

  గత పదేళ్లకుపైగా ఓకే రకం

  గత పదేళ్లకుపైగా ఓకే రకం పాత్రలను ధరిస్తున్నాననే మాటలో కొంత వాస్తవం ఉంది. కానీ నాకు సంబంధించినంత వరకు అదే కరెక్ట్. ఎందుకంటే ఛాలెంజింగ్, కొత్తదనం ఉండటానికి చేసిన సినిమాలు పోతున్నాయి. నేను మంచి సినిమాలు చేశాను కానీ కమర్షియల్‌గా ఆడలేదు. మై ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, ఈ అబ్బాయి చాలా మంచోడు, నేనింతే సినిమాలు వండర్‌ఫుల్‌గా ఉంటాయి. ఛాలెంజ్ అని చూస్తే దెబ్బ పడుతున్నాయి.

  సినిమా కమర్షియల్‌గా

  సినిమా కమర్షియల్‌గా

  ఆ సినిమా కమర్షియల్‌గా ఆడకపోవడంతో కథల ఎంపికలో మార్పు వచ్చింది. దాంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ప్రయారిటిని మార్చుకొన్నాను. నా సినిమాలు ప్రేక్షకులకు వినోదం పంచాలి అనే పాయింట్‌ను దృష్టిలో పెట్టుకొంటాను. వినోదం అనేది ఒక్కో దర్శకుడిని బట్టి మారుతుంది. పూరి జగన్నాథ్‌ది ఓ తరహా, అనిల్ రావిపూడి మరో తరహా ఉంటుంది.

  విభిన్నమైన కథలు

  విభిన్నమైన కథలు

  విభిన్నమైన కథలు దొరకకపోవడంతో నాకు ఓ సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ రావడం నాకు, నా కెరీర్‌కు ఉపయోగపడింది. ఆ టైమ్‌లో ఫ్యామిలీతో కలిసి చాలా ప్రాంతాలు, ప్రదేశాలు తిరిగి వచ్చాను. ఆ సమయంలో ఏమేమో వార్తలు వచ్చాయి. వాటిని పట్టించుకోలేదు. ఇప్పడు వరుసగా సినిమాలు చేస్తున్నాను.

  సినిమా మేకింగ్‌లో చాలా

  సినిమా మేకింగ్‌లో చాలా

  సినిమా మేకింగ్‌లో చాలా మార్పులు వస్తున్నాయి. కొత్తవాళ్లు చాలా డిఫరెంట్ ఐడియాలతో ముందుకు వస్తున్నారు. కొత్త డైరెక్టర్లు చాలా క్లారిటిగా ఉన్నారు. క్లియర్‌గా ఉన్నారు. మంచి కాన్సెప్టులతో వస్తున్నారు. మరో రెండేళ్లలో టాలీవుడ్ మరోస్థాయికి వెళ్లడం ఖాయం.

  English summary
  Touch Chesi Chudu is an upcomingTelugu film written by Vakkantham Vamsi and directed by Vikram Sirikonda which marks the latter’s directorial debut in Telugu cinema.It features Ravi Teja, Raashi Khanna and Seerat Kapoor in the lead roles while Freddy Daruwala plays the main antogonist which marks his debut in Telugu cinema. This movie set to release on February 2. In this occassion Ravi Teja speaks to Telugu Filmibeat.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more