»   » ఈ సంక్రాంతికైనా బాలయ్యబాబు రవితేజపై పైచేయి సాధిస్తాడంటారా..!

ఈ సంక్రాంతికైనా బాలయ్యబాబు రవితేజపై పైచేయి సాధిస్తాడంటారా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా ఇండస్టీకి సింహాతో ఓకోత్త రికార్డుని పరిచయం చేసిన బాలయ్యబాబు రవితేజ దెబ్బకి భయపడుతున్నట్లు సినీవర్గాలు భావిస్తున్నాయి. దానికికారణం ప్రస్తుతం బాలయ్యబాబుకి మరియు రవితేజకు ఈసంక్రాంతికి గట్టిపోటీ ఉండడమే. పోయిన సంక్రాంతికి ఈఇద్దరూ హీరోలే బరిలో నిలవగా బాలయ్యబాబుపై రవితేజు విజయం సాధించాడు. అధేవిధంగా ఈసంవత్సరం కూడా బాలయ్యబాబు దాసరి దర్శకత్వంలో పరయవీరచక్రతో వస్తుండగా రవితేజ మిరపకాయ్ అంటూ బాలయ్యబాబుకి పోటీగా రావడానికి సిద్దమయ్యాడు. దాంతో బాలయ్యబాబు అభిమానులలో కోంచెం నిరాశక్తి కనపడుతుంది.

గత సంక్రాంతికి బాలయ్యబాబు ఒక్కమగాడు అంటూ తన సత్తా చాటాలని అనకోని మగాడు కాలేకపోయాడు. ఇది బాలయ్యబాబు జీవతంలో పెద్ద డిజాస్టర్ గామిగిలిపోయింది. అదేసమయంలో రవితేజ వివివినాయక్ దర్శకత్వంలో తీసినటువంటి కృష్ణ బాక్సాఫీస్ రికార్డలను నమోదుచేసింది. ఐతే నిజానికి ఇక్కడ మనం ఆనందించతగ్గ విషయం ఒకటి ఉంది. అదేంటంటే బాలయ్యబాబు అభిమానులతో పోల్చుకున్నట్లైతే రవితేజకు పెద్ద ప్యాన్ ఫాలోయింగ్ లేదు. ఈవిషయం బాలయ్య బాబుకి కలసివచ్చే విషయం. ఐతే ఈసారి అన్నా బాలయ్యబాబు మంచి హిట్ ఇచ్చి రవతేజకు తగిన సమాధానం చెప్పాలని బాలయ్యబాబు అభిమానలు కోరుకుంటున్నారు.

అసలు బాలయ్యబాబుకి రవితేజకు పోటీ ఏంటా అనిఅనుకుంటున్నారా.. గతంలో వీరిద్దరి మధ్య కోన్ని వివాదాలు చేసుకున్నాయని ఫిలిమ్ వర్గాల సమాచారం. ఎట్టకేలకు ఈసారి బాలయ్యబాబు, రవితేజపై విజయం సాధించి తమ పరువు నిలపాలని అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి అభిమానుల ఆశని బాలయ్యబాబు నెరవేర్చుతాడో లేదో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu