»   » రవితేజ కొత్త చిత్రం 'మిరపకాయ' ప్రారంభం

రవితేజ కొత్త చిత్రం 'మిరపకాయ' ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ నూతన చిత్రం మిరపకాయ..వీడు చాలా హాట్ గురూ ఈ రోజు(శుక్రవారం) లాంఛనంగా బెల్లంకొండ సురేష్ ఆఫీసులో ప్రారంభమైంది. ప్రభాస్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, వెంకటేష్ క్లాప్ కొట్టారు. ఇక మొదటి షాట్ కు వివి వినాయిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ, దీక్ష హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ...నేను బ్యానర్ ప్రారంబించిందే రవితేజ సినిమాలు చేయటం కోసం అన్నారు. హరీష్ శంకర్ చెప్పిన కథ బాగా నచ్చింది. మే ఎనిమిది నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇజ్రాయిల్, ప్యారిస్ లలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. 2010 దీపావళికి ఈ చిత్రం రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇక రవితేజ మాట్లాడుతూ...ఇది ఓ పెంటాస్టిక్ చిత్రం. హరీష్ శంకర్ నన్ను షాక్ తర్వాత దర్శకత్వం చేస్తున్నాడు. అలాగే సంగీత దర్శకుడు తమన్ తో నాకు ఇది మూడో చిత్రం. కెమెరా మెన్ గా రాజశేఖర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు. మిరపకాయ ఓ ఫుల్ ప్లెడ్జెడ్ ఎంటర్టైనర్ అని ముగించారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడితూ...అంతకు ముందు నా మా కాంబినేషన్లో వచ్చిన షాక్ ఫేట్ ను పట్టించుకోకుండా రవితేజ నేను చెప్పిన కథను బాగా నమ్మి ఈ అవకాశం ఇచ్చారు. అన్నారు. అలాగే నిర్మాత కూడా ఏ లోటూ రానీయకుండా సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ మిరపకాయ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ కామిడీగా మలుస్తాను అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu