For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ర‌వితేజ 'బెంగాల్ టైగ‌ర్' ఎప్పుడంటే? (అఫీషియల్ ప్రెస్ నోట్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: బలుపు, పవర్ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాలతో మాంచి ఊపుమీదున్న మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా, మిల్కి బ్యూటి త‌మ‌న్నా, స్మైలింగ్ సుంద‌రి రాశి ఖ‌న్నాలు క‌ధానాయిక‌లుగా, రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన‌ సంపత్ నంది దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి బెంగాల్ టైగర్ టైటిల్‌ ని ప్ర‌క‌టించ‌గానే మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ ఎన‌ర్జికి స‌రియైన టైటిల్ అని అటు సినిమా ఇండ‌స్ట్రి లో ఇటు అభిమానుల్లోను మాంచి కిక్ వచ్చింది.ఇక ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని అందించిన అభిరుచి గల నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జ‌నవ‌రిలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. మార్చిలో రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభిస్తారు.

  Ravi Teja Movie Bengal Tiger

  అత్తారింటికి దారేది చిత్రం త‌రువాత తెలుగు లో బోమ‌న్ ఇరాని... బాలీవుడ్ ఉత్త‌మ న‌టుడు బోమ‌న్ ఇరాని ఏ చిత్రం చేయాల‌న్నా క‌థ‌కి ఇంపార్టెన్స్ ఇస్తారు. తెలుగులో అత్తారింటికి దారేది చిత్రం త‌రువాత తెలుగులో ఎన్నో క‌థ‌లు విన్నా కూడా ఏ క‌థ‌ని ఫైన‌ల్ చేయ‌లేదు. ఇప్ప‌డు చాలా గ్యాప్ తీసుకుని మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ , సంప‌త్ నంది కాంబినేష‌న్ లో వ‌స్తున్న బెంగాల్ టైగ‌ర్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయ‌న‌ మెయిన్ కేర‌క్ట‌ర్ చేయ‌టం విశేషం గా చెప్పుకోవాలి.

  ఈ సినిమా గురించి హీరో రవితేజ మాట్లాడుతూ...... సంపత్ నంది చెప్పిన కథను సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశాను. సంపత్ నంది అందరినీ ఎంటర్ టైన్ చేయగల సత్తా ఉన్న పవర్ ఫుల్ డైరెక్టర్. ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్ర కథను తీర్చిదిద్దాడు. అన్ని వర్గాల్ని ఆకట్టుకునే కథ ఇది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు వుంటాయి. కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. కథకు తగ్గట్టుగా ఈ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ బెంగాల్ టైగర్ అనే టైటిల్ ఖరారు చేశాం. నిర్మాత రాధామోహన్ సినిమాల మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆయన బ్యానర్లో సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అని అన్నారు.

  నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ.... ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి మోస్తరు బడ్జెట్ చిత్రాలు నిర్మించిన నాకు మాస్ మహారాజ రవితేజ అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకు రుణపడి ఉంటాను. ఆయన మా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేశాం. సంపత్ నంది చెప్పిన కథ అన్ని వర్గాల్ని ఆకట్టుకునేలా ఉంది. సంప‌త్ నంది ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. కథకు తగ్గట్టుగా బెంగాల్ టైగర్ టైటిల్ పెట్టాం. టైటిల్ కు తగ్గట్టుగానే హీరో క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశాం. జ‌న‌వ‌రి లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాం. మార్చి నుండి రెగ్య‌ల‌ర్ షూటింగ్ చేస్తాం. అందాల భామలు తమన్నా, రాశిఖ‌న్నా లు రవితేజతో జోడీ కడుతున్నారు. అత్తారింటికి దారేది చిత్రం త‌రువాత బాలీవుడ్ న‌టుడు బోమ‌న్ ఇరాని ఎన్నో క‌థ‌లు విన్నాకూడా ఎంతో సెల‌క్టివ్ గా వుండే ఆయ‌న మా చిత్రం చేయ‌టం మాకు చాలా ఆనందంగా వుంది. అని అన్నారు.

  దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ... మాస్ మహరాజ్ రవితేజతో సినిమా చేయాలన్న నా కోరిక ఈ సినిమాతో తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమాల మీద అభిరుచి ఉన్న నిర్మాత కె కె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేశారు. రవితేజ ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ కు తగ్గట్టుగా ఈ చిత్ర కథ సిద్ధమైంది. అంతే పవర్ ఫుల్ గా ఉండేలా బెంగాల్ టైగర్ అనే టైటిల్ పెట్టాం. రవితేజ, తమన్నా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. రవితేజ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. రవితేజ ఫ్యాన్స్ ఆశించే మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నాం. నా మీద నమ్మకంతో సింగిల్ సిట్టింగ్ లో కథను ఓకే చేసిన రవితేజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అత్తారింటికి దారేది లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంలలో న‌టించిన బాలీవుడ్ బెస్ట్ ఆర్టిస్ట్ బోమ‌న్ ఇరాని రెండ‌వ చిత్రంగా మా చిత్రం చేయ‌టం చాలా ఆనందంగా వుంది. అని అన్నారు.

  జ‌న‌వ‌రి లో ప్రారంభంకానున్న‌, ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి తదిత‌రులు న‌టించ‌గా.. బ్యాన‌ర్‌..శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌ కెమోరా.. సుందర రాజ‌న్‌, ఎడిట‌ర్‌.. గౌత‌మ్‌రాజు, ఆర్ట్‌.. డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత‌..కె.కె.రాథామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం.. సంప‌త్ నంది.

  English summary
  Raviteja’s latest movie with director Sampath Nandi will be launched in January 2015 in Hyderabad. The Mass Maharaja Raviteja with 2 successive hits ‘Balupu’ and ‘Power’ is busy with ‘Kick 2’ and is coming up with the movie titled ‘Bengal Tiger’ to be directed by Sampath Nandi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X