»   » రవితేజ ‘పవర్’ ఆడియో వేడుక ఆరోజేనా?

రవితేజ ‘పవర్’ ఆడియో వేడుక ఆరోజేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మహారాజ రవితేజ హీరోగా రాకలైన్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి పతాకంపై కె.ఎస్.రవీంద్రనాథ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'పవర్'. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆడియోను మే 11న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది. సినిమా యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్నిజూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. రవితేజ గత చిత్రం 'బలుపు' కూడా గతేడాది జూన్ నెలలో విడుదలైన సంగతి తెలిసిందే.

Ravi Teja 'Power' audio on May 11th

రవితేజ సరసన హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, ముఖేష్ రిషి, రావు రమేష్, మిర్చి సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖా వాణి, జోగి బ్రదర్స్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : ఎస్ఎస్. థమన్, ఫోటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటర్: గౌతం రాజు, మాటలు : కోన వెంకట్, స్ర్కీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, కో డైరెక్టర్: నందగోపాల్ కురుళ్ల, ప్రొడక్షన్ కంట్రలర్: పి.ఎ.కుమార్ వర్మ, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్(బాబి).

English summary
Mass Maharaja Ravi Teja and Hansika are acting together in the film ‘Power’. The audio album is being composed by Thaman SS and the makers are looking at May 11th as the possible release date for the audio album.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu