For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్లీన్ గా బయటకి వచ్చిన రవితేజా: సెన్సార్ బోర్డ్‌తో రాజా ది గ్రేట్ అనిపించుకున్నాడు

  |

  మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప‌టాస్‌, సుప్రీమ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తెరకెక్కించిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం "రాజా ది గ్రేట్". "వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్‌" క్యాప్ష‌న్‌. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని అన్ని పనులు ముగించుకున్నఈ సినిమా కొద్దిసేపటి క్రితమే సెన్సార్ పనుల్ని కూడా పూర్తిచేసుకుంది.

  "వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్‌"

  టాలీవుడ్ లో మాస్ మహారాజగా పేరొందిన 'రవితేజ' సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 'బెంగాల్ టైగర్' సినిమా అనంతరం ఆయన ఏ సినిమా ఒప్పుకోలేదనే సంగతి తెలిసిందే. తాజాగా మాస్ మహరాజ్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాడు..

   మనమే ఎదురెళ్లి తీసుకోవాలి

  మనమే ఎదురెళ్లి తీసుకోవాలి

  లైఫ్ ఏదీ ఎదురొచ్చి మనకు ఇవ్వదు. మనమే ఎదురెళ్లి తీసుకోవాలి. బాధ నుండి సంతోషం అయినా... ఓటమి నుండి గెలుపైనా....అంటూ రవితేజ డైలాగులు ఇరగ దీశారు. చాలా కాలం తర్వాత రవితేజ తనకి కావాల్సిన హిట్ ఈ సినిమా తో రావచ్చనే ఆశతోనే ఉన్నాడు.

  రాశి ఖన్నా ఐటంసాంగ్‌

  రాశి ఖన్నా ఐటంసాంగ్‌

  అనిల్ రావిపూడి మొదటి చిత్రం పటాస్, రెండో చిత్రం సుప్రీం రెండూ హిట్ అయినవే కావడంతో రాజా ది గ్రేట్‌తో హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడి ఖాతాలోకి ఎక్కాలనేది అనిల్ ఆశ. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మాస్ మహారాజను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్న చిత్రం ఇది. రవితేజ సరసన మెహ్రీన్ ఫిర్జాదా జంటగా నటించగా, సుప్రీం బ్యూటీ రాశి ఖన్నా ఓ ఐటంసాంగ్‌లో స్టెప్పేసింది.

  దిల్ రాజు

  దిల్ రాజు

  దువ్వాడ జగన్నాథమ్, ఫిదా లాంటి హిట్ చిత్రాలతో మంచి లాభాలు పొందిన నిర్మాత దిల్ రాజు 'రాజా ది గ్రేట్'ని చాలా జాగ్రత్తలు పాటించి మరీ నిర్మించినట్టు ఇటీవల కాలంలో అనేక వార్తలు రావడం తెలిసిందే. పలు సన్నివేశాలు రీషూట్ చేయించి మరీ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడనేది ఇటీవల బాగా వైరల్ అయిన వార్త. ఇంతమంది ఆశలు పెట్టుకున్న ఈ సినిమా వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే ఇంకో వారం రోజులు వేచిచూడాల్సిందే.

  అంధుడైన ఒక యువకుడు

  అంధుడైన ఒక యువకుడు

  ఈ చిత్రంలో రవితేజ పేరు ‘రాజా ది గ్రేట్' అంధుడైన ఒక యువకుడు తనకు ఎదురైన ఆటంకాలను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

   క్లీన్ యు/ఏ సర్టిఫికెట్‌

  క్లీన్ యు/ఏ సర్టిఫికెట్‌

  ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ సభ్యుల నుండి క్లీన్ యు/ఏ సర్టిఫికెట్‌తో పాటు, ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెహరీన్ హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రంలో రవితేజకి తల్లిగా సీనియర్ నటి రాధిక నటించారు.

  English summary
  Mass Maharaj Ravi Teja's Raja The Great got its censor formalities today and was issued with U/A certificate without any cuts. Incidentally, the makers locked the release date of the movie as 18th of this month which is a day prior to the previous scheduled date of release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X