»   » ఆ బ్యూటీ ఊ అంటే నేను మళ్ళీ రెడీ నొక్కివొక్కానించిన..మాస్ హీరో

ఆ బ్యూటీ ఊ అంటే నేను మళ్ళీ రెడీ నొక్కివొక్కానించిన..మాస్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్యూటి శ్రియతో తాను మళ్ళీ నటించడానికి రెడీ అంటూ నోరు తెరిచి రవితేజ అడిగారు. తనకు నచ్చిన వ్యక్తి శ్రియ అనీ, ఆమెతో కంటిన్యూచేస్తానంటూ..నొక్కి చెప్పాడు. దీంతో శ్రియ ముసిముసి నవ్వులు నవ్వేసింది.

అలాగే నిర్మాత వెంకట్‌ సినిమాను ప్రేమించే వ్యక్తనీ, తమ ఇద్దరి వేవ్‌ లెంగ్త్‌ లు కుదిరాయన్నాడు. 'కిక్‌" తర్వాత 'డాన్‌ శీను" చేశాను. సూపర్‌ హిట్‌ అయింది. ఆయన అడిగితే ఎన్ని సినిమాలైనా చేయడానికి నేను రెడీ" అన్నారు. ఇది ఈ రోజు(18.08.10) ప్రసాద్ లాబ్స్ లో జరిగిన డాన్‌ శీను ప్లాటినం డిస్క్‌ వేడుకలో రవితేజ తెలియజేశారు. ఈ ఫంక్షన్ కి ఇంకా పాపులర్ పర్సనాలిటీ విచ్చేశారు. శ్రియ, రవితేజ, సురేష్ రెడ్డి, కె అచ్చిరెడ్డి, గోపిచంద్, గౌతమ్ రాజు, కోన వెంకట్, రఘు, ఆలీ తదితరులు హాజరు అయ్యారు.

ఆ తర్వాత శ్రియ స్పందిస్తూ...డాన్ శీను తర్వాత నేను రవితేజ ఫ్యాన్‌ అయిపోయాను. ఎంతో ఎనర్జిటిక్‌ గా నటించాడు. డెఫ్‌ అండ్‌ డమ్‌ క్యారెక్టర్‌ చేస్తుంటే...రాత్రిల్ళు కూడా గుర్తుకువచ్చి తెగ నవ్వేశాను అంది. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని శ్రియ స్పందించారు. ఈ సినిమా ద్వారా నాకో స్టార్ అంజనా, నేను చాలా ఫ్రెడ్లీగా ఉన్నాము అలాగే చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం, వేణు మాధవ్, మరియు ఆలీ తో కలిసి నటించినందుకు చాలా హ్యాపీగా ఉందని తెలియజేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu