twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రవితేజ ఫ్రమ్‌ ఆంధ్ర' అని గర్వంగా చెప్పుకునేవాణ్ణి

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాన్నది తణుకు దగ్గర ఖండవిల్లి. అమ్మది జగ్గంపేట. నేను పుట్టింది అమ్మమ్మగారింట్లో. నేను పుట్టిన ఆరునెలల తరవాత నాన్న ఉద్యోగరీత్యా ఉత్తరాదికి వెళ్లారు. నా బాల్యమంతా భోపాల్‌, ఢిల్లీ, ముంబై, జైపూర్‌లలో గడిచింది. అందువల్ల అప్పట్లో నాకు తెలుగు అంతగా వచ్చేది కాదు. హిందీ, మరాఠీ బాగా వచ్చేవి. ఇంట్లో హిందీలోనే మాట్లాడుకునేవాళ్లం. స్కూల్లో 'రవితేజ ఫ్రమ్‌ ఆంధ్ర' అని గర్వంగా చెప్పుకునేవాణ్ణి అంటున్నారు స్టార్ హీరో రవితేజ. ఆయన తన చిన్నతనం గుర్తు చేసుకుంటూ ఇలా స్పందించారు.

    అలాగే తొమ్మిదోయేట వరకూ బాగానే చదివేవాణ్ణి. కానీ, అప్పుడు నేను చూసిన మొదటి సినిమా నన్ను చాలా మార్చింది. ఆ సినిమా షోలే. అందులో పోరాటాలూ, అమితాబ్‌ చేసే విన్యాసాలూ చూసి సినిమా పిచ్చిలో పడిపోయా. బిగ్‌ బీకి వీరాభిమానినైపోయా. బడి ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లేవాణ్ణి. 'మరి డబ్బులూ...' అంటారా? అందుకు 'దేవుడే' దారి చూపించాడు.

    అమ్మానాన్నలకు దైవభక్తి ఎక్కువ. ఇంట్లో పూజలు చేసి దేవుడికి కానుకలుగా చిల్లర డబ్బులు వేసేవాళ్లు. వాటిని నేను తీసేసుకునేవాణ్ణి. అవి అయిపోతే అమ్మ పర్సులో డబ్బులు నొక్కేసేవాణ్ణి. ఎందుకంటే... అమ్మ పర్సులో డబ్బులు పెట్టుకుంటుంది తప్ప ఎప్పుడూ లెక్కపెట్టదు. కానీ, నాన్న అలా కాదు. జేబులో ఎంతుందో చిల్లరతో సహా ఆయనకు గుర్తుంటుంది. అందుకే, అమ్మ పర్సే నాకు దిక్కు.

    నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఓరోజు బడికి ఎగనామం పెట్టి మా పక్కింట్లో ఉండే స్నేహితుడితో కలిసి సినిమాకి వెళ్లాను. టిక్కెట్టు కొంటున్న నన్ను అమ్మ చూసేసింది. ఆ విషయం నాకు తెలియక... సినిమా చూసి ఇంటికెళ్లా. తమ్ముళ్లిద్దరూ 'రారా, ఇవాళ నీకుందిలే! అమ్మ నిన్ను థియేటర్‌ దగ్గర చూసేసింది' అన్నారు. ఇక నాకు మూడింది అనుకుని... పుస్తకాలను గుమ్మం దగ్గరే పడేసి బయటకు పరుగుతీశా. నాతో సినిమాకొచ్చిన స్నేహితుడికీ ఈ విషయం చెప్పాను.

    ఇద్దరమూ రైల్వేస్టేషన్‌కి పారిపోయాం. ప్లాట్‌ఫారం మీద 'భోపాల్‌ టు ముంబై' అని రైలుంటే ఎక్కేశాం. మధ్యాహ్నం ఆకలేస్తే రైలు దిగాం. ఇంటికెళ్తే కొడతారని నా స్నేహితుడి చుట్టాలింటికి వెళ్లి భోంచేశాం. రెండ్రోజులు కనిపించకపోతే ఇంట్లోవాళ్లు కచ్చితంగా కరిగిపోతారన్న ధైర్యంతో ఇంటికి బయల్దేరాం. అలాగే జరిగింది. అమ్మానాన్నా ఏమీ అనలేదు. నిజానికి ఆ రోజు ఆ రైలు కదిలి ఉంటే నేను ఈరోజు ఎక్కడ ఎలా ఉండేవాణ్ణో అంటూ వివరించారు.

    English summary
    Ravi Teja says that his childhood days are very happy. In that time he is in Bhoopal. He said that as a child he proud to be say..I am from Andhra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X